జబర్దస్త్ వినోదిని మీద హత్యాయత్నం !

186

జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వల్గారిటీ ఎక్కువైందని ఈ మధ్యకాలంలో విమర్శలొస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఈ కామెడీ షోను ఆదరించే విషయంలో క్లారిటీతో ఉన్నారు. అయితే జబర్దస్త్‌లో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎంతో మంది మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తున్నప్పటికీ కామెడీగానే కనిపిస్తారు తప్ప అమ్మాయేనేమో అన్న భ్రమను కలిగించలేరు. ఒక్క కమెడియన్ మాత్రం అచ్చమైన అమ్మాయిలానే కనిపిస్తాడు. అమ్మాయిలకే అసూయ కలిగించేలా ఉంటాడు. అతనెవరో మీకీపాటికి అర్థమై ఉంటుంది. జబర్దస్త్ వినోదినిగా పేరు తెచ్చుకున్నాడు వినోద్. అయితే ఇప్పుడు వినోద్‌ పై హత్యాయత్నం జరిగింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

హైదరాబాద్‌లోని కాచిగూడలో అద్దె ఇంటిలో నివాసిస్తున్న వినోద్‌పై ఇంటి ఓనర్ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ ప్రస్తుతం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. తన ఇంటి ఓనర్ తనపై హత్యాయత్నం చేసినట్టు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసారు వినోద్. కాగా నాలుగు నెల‌ల క్రితం వినోద్ తాను ఉంటున్న 70 గ‌జాల ఇంటిని కొనుగోలు చేసేందుకు య‌జ‌మానికి రూ.10ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అయితే అడ్వాన్స్ తీసుకున్న తరువాత ఆ ఇంటిని అమ్మనని.. అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం రేగినట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం వినోద్ ఇంటి య‌జ‌మానిని నిల‌దీయ‌గా ఇంటి య‌జ‌మానితో పాటు అత‌ని భార్య కొడుకులు వినోద్‌పై దాడికి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వినోద్ త‌ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి.. దాడికి దిగిన వారిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసేందుకు పోలీసులు స‌న్న‌ద్దం మ‌య్యారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అనే విషయాలు మాత్రం తెలియలేదు.

అయితే ఇంటి యజమాని దాడి అని చెబుతుండడంతో ఆర్ధిక సంబంధమైన విషయాల వలన ఏమైనా దాడి జరిగిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా వినోద్ ఆత్మహత్యా యత్నం చేసి వార్తల్లోకి ఎక్కాడు. తనకి ఇష్టం లేకుండా బలవంతంగా మేనకోడలితో పెళ్లి చేస్తున్నారని చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత అదేమీ లేదని మీడియాలో క్లారిటీ ఇచ్చినా అప్పటికే ఆ విషయం వైరల్ అయిపొయింది. అప్పుడు ఆత్మహత్యాయత్నం ఇప్పుడు హత్యాయత్నంతో ఈయన మళ్ళీ హెడ్ లైన్స్ లోకి ఎక్కారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మరి వినోద్ గురించి అతని మీద జరిగిన దాడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.