ఆ రూమర్స్ సృష్టించడం వల్లే నాకు ఈ దుస్థితి వాళ్ళ పెళ్ళాల దగ్గర కూడా చంటి సంచలన కామెంట్స్

498

తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .ప్రతి ఇంట్లో అందరూ కూర్చొని మిస్ అవ్వకుండా చూసే షో ఏంటి అంటే టక్కున ఈటీవీ లో వచ్చే జబర్దస్త్ అని చెప్తారు. ఇక ఈ షో మొదలైన తరువాత తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ షో నే లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు చలాకి చంటి. అయితే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే చంటి ఇప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయనేమన్నాడో చూద్దామా.

Image result for chalaki chanti

చలాకి చంటి జబర్దస్త్ షో ద్వారా బాగా ఫెమస్ అయ్యాడు. చాలా సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే ఏమైందో ఏమో గాని జబర్దస్త్ షో చేయడం ఆపేశాడు. ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయ్యే నా షో నా ఇష్టం కి యాంకర్ గా చేస్తున్నాడు, టీవీ షోస్ లో బిజీ గా ఉంటూనే తనకి వచ్చే ప్రతి సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకొని తన నటనతో అందరిని అలరిస్తున్నాడు. అయితే సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇప్పుడు మళ్ళి జబర్దస్త్ షో లో రీ ఎంట్రీ ఇచ్చాడు.అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు. తాను అన్ని విషయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అని చెప్పారు. అందుకే నాకు అవకాశాలు రావడం లేదు. దర్శకులకు నేను కనిపించినప్పుడు పలకరిస్తారు. కానీ గౌరవం ఇవ్వరు. అందుకు నాకు ఎలాంటి భాద లేదని చంటి తెలిపాడు. దర్శకులకు నన్ను తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్లు చెడగొడుతారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

షూటింగ్స్ కి టైమ్ కి రాడంట అంటూ చెడగొడతారు. నిజానికి వాళ్ళతో నేనెప్పుడూ పని చేయలేదు. నా గురించి తెలియకుండా అలా చెప్పేస్తుంటారు. అది నిజం కాకపోయినా దర్శకులు అదే నిజమేమో అని అనుకుంటారు. ఇలాంటి పుకార్ల వలన చాలా మంది ఆర్టిస్టులు, హీరోయిన్ల జీవితాలు నాశనం అయ్యాయి అని చలాకి చంటి తెలిపాడు. చంటి డబ్బు కోసం గొడవ పెట్టుకుంటాడు. అతడు వద్దులే అని ఇంకో దర్శకుడికి చెబుతారు. అంతేకాదు ఇక్కడ అవకాశాలు రావాలంటే అవతలి వాళ్ళని కూడా నిత్యం పొగుడుతూనే ఉండాలి. చివరికి వారి పెళ్ళాం పిల్లల దగ్గరకి వెళ్లి వాళ్ళని కూడా పొగడాలి అని ఆవేదన వ్యక్తం చేసారు.చంటి ఆవేశంలో చెప్పినా కూడా అతను చెప్పిన దానిలో వాస్తవం ఉందని అందరు గమనించాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. చలాకి చంటి గురించి ఆయన చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.