Breaking News : రోడ్డుప్రమాదంలో ‘జబర్దస్త్’ చలాకీ చంటికి గాయాలు

186

తెలుగులో బాగా ఫేమస్ అయిన కామెడీ షో ‘జబర్దస్త్‌’లో నటించే చలాకీ చంటికి పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే గుమిగూడిన జనం గాయపడింది జబర్దస్త్ చంటి అని గుర్తించారు. ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక కోదాడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడి నుంచి తరలించి జాతీయ రహదారిపై వాహన రాకపోకలను పునరుద్ధరించారు. కోదాడలో ప్రథమచికిత్స అనంతరం చంటి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

Jabardast fame Chalaki Chanti Injured In Road Accident

చలాకీ చంటిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన చంటి జబర్దస్త్‌ షోతో పాటు అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేస్తున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. చంటికి గతేడాది జూన్‌ నెలలోనూ కారు ప్రమాదం జరిగింది. 2018 జూన్ 12న మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా.. చంటి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ నెలలోనే మరోసారి ఆయన ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇకపోతే వరుసగా జరుగుతున్న ప్రమాదాలు టాలీవుడ్ ను భయబాంత్రులకు గురిచేస్తుంది. ఎందుకిలా జరుగుతోంది? మన హీరోల టైమ్ బాగాలేదా? అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఒకరు లేదా ఇద్దరికి ఇలా జరిగిందంటే లైట్ తీసుకోవచ్చు… కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సందీప్ కిషన్.. మొదలు ఏడుగురు యంగ్ హీరోలు ప్రమాదాలకు గురి కావడం, ఈ సంఘటనలన్నీ ఈ రెండు నెలల గ్యాప్‌తో సంభవించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇకపై ఎవరు ప్రమాదానికి గురికాకూడదని కోరుకుందాం. మరి చలాకి చంటికి జరిగిన ఈ ప్రమాదం గురించి అలాగే టాలీవుడ్ లో జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.