దక్షిణాది సినీ రంగంలోకి అడుగు పెడుతున్న జాన్వీ కపూర్?

442

అతిలోక సుందరి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది జాన్వీ కపూర్.ఇటీవలే ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకుంది.అయితే ఈ మద్యమే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే దక్షిణాది ప్రేక్షకులకూ పరిచయం అవ్వబోతుంది అని ఒక వార్త కొడైకూస్తుంది.

ఒక తమిళ సినిమా ద్వారా జాన్వీ ఇక్కడకు ఎంట్రీ ఇవ్వబోతోందా అంటే ఔననే అంటున్నాయి తమిళ సినిమా వర్గాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జాన్వీని సౌత్ లో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట శింబు, వెంకట్ ప్రభు.ప్రస్తుతం తమిళంలో వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తోంది. వైవిధ్యభరితమైన సినిమాలకు కేరాఫ్ వెంకట్ ప్రభు. ఈ దర్శకుడు ఇప్పుడు శింబు హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.శ్రీదేవి కూతురును హీరోయిన్‌గా నటింపజేస్తే ఆ సినిమాకు అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా ఆదరణ పెరుగుతుంది. అందుకే జాన్వీని హీరోయిన్‌గా నటింపజేయడానికి ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జాన్వీకి బాలీవుడ్‌లో బోలెడు అవకాశాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ సౌత్ సినిమాకు ఓకే చెబుతుందా? అనేది సందేహమే.