రూ.500 కోట్ల ప్రాజెక్టులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..

417

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన ఆమె కుమార్తె జాన్వీ కపూర్.. తన తొలి చిత్రం “దఢక్‌”తోనే తనేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్‌కు అనేక ఆఫర్లు వచ్చాయి.అయితే ఆమె తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో ఓ బడా ఆఫర్ ఈ ముద్దుగుమ్మకు వచ్చింది.

Image result for jhanvi kapoor

కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్‌కి ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తుంది. “తక్త్” అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుంది.అలాగే అలియా భట్‌తో పాటు విక్కీ కౌశల్, అనీల్ కపూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

takth movie still

విక్కీ కౌశల్‌కి జతగా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంది. ‘సింహాసనం’ కోసం పోరాడే వారియర్ సినిమాగా ఈ చిత్రంగా తెలుస్తోంది.