అది పెరగడానికి చికిత్స చేపించుకుంటున స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

502

ఏంటో ఈ మధ్య కొంతమంది హీరోయిన్ల పరిస్థితి అస్సలు బాలేదు..కొన్ని సినిమాల్లో వారి నటనతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు, వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. కొంతమంది వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతుంటే కొందరేమో ఫైనాన్సియల్ గా కష్టపడితే, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ ఆ ఆపరేషన్ అని ఈ ఆపరేషన్ అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఒక స్టార్ హీరోయిన్ కు సర్జరీ చేపించుకుంది. మరి ఆమె ఎవరో ఏమైందో తెలుసుకుందామా.

Image result for Kannada Sanjana

కన్నడ భామ సంజనా… బుజ్జిగాడు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైనా సంజనా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 45 సినిమాలకు పైగా నటించింది. అంతేకాకుండా తన నటనతో, అందంతో ఎంతోమంది కుర్రకారు మనసులను దోచుకున్న సంజనా ఆరోగ్యం ప్రస్తుతం సరిగా లేదు. ఈమెకు బెంగుళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో సర్జరీ చేసారు.ఈమెకు తన అండాశయంలో 550 ఎమ్‌ఎల్‌ డెర్మాయిడ్‌ గడ్డ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో ఈ సర్జరీ నిర్వహించి ఆ గడ్డను తీసివేశారని సంజన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్‌ చేసి తన భాధను వ్యక్తం చేసింది.అందుకే దాదాపు ఒక నెల నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదని పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రతి ఆడపిల్లకు ఒక గొప్ప సందేశం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇచ్చింది. ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్‌ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరి మహిళలను హెచ్చరించింది. అయితే ప్రస్తుతం ఈమె ఆరోగ్యంగానే ఉన్నట్టు అక్కడి వైద్యులు మీడియా వర్గాలకు తెలియజేసారు. ఈమె ప్రస్తుతం తెలుగులో ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ అనే సూపర్ హిట్ సీరియల్ లో నటిస్తుంది.ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడిని కోరుకుంటున్నారు. మనం కూడా ఆమె త్వరగా కోలుకొని మళ్ళి నటించి మన అందరిని అలరించాలని కోరుకుందాం. మరి సంజన గురించి అలాగే ఇప్పుడు ఆమెకు జరిగిన ఈ సర్జరీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.