ఇస్మార్ట్ శంకర్ రివ్యూ… తెలంగాణ పోరోడు కుమ్మేశాడు…

396

నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే.. మార్ ముంత చోడ్ చింత!’ అంటూ థియేటర్స్‌లో ప్రేక్షకుల మధ్య కిరికిరి చేసేందుకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నేడు థియేటర్స్‌కి వచ్చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ ఈ ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ‘టెంపర్’ చిత్రం తరువాత హిట్ ముఖమే చూడని డేరిండ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరీని కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ శంకర్’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పూరీ మార్క్ టేకింగ్‌కి రామ్ హై ఓల్టేజ్ యాక్షన్‌తోడు కావడంతో ట్రైలర్, టీజర్‌లు ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ లెక్కే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందొ చూద్దామా.

Image result for ismart shankar images

కథ…
హైదరాబాద్ చార్మినార్ ఏరియాలో జల్సాగా తిరిగే ఒక కుర్రాడి కథనే ఇస్మార్ట్ శంకర్. రౌడీలుగా ఉన్న శంకర్ కు ఒకరిని చంపే ఆఫర్ వస్తుంది. ఆ చంపే క్రమంలోనే హీరోయిన్ నభా నటేష్ తో ప్రేమ వ్యవహారం నడుపుతాడు. అలాగే సిబిఐ ఆఫీసర్ అరుణ్ ఈ కేసును ఛార్జ్ తీసుకుంటాడు. అలాగే అపార్ట్ మెంట్ ప్లాట్స్ అక్రమంగా అమ్ముతుంటారు విలన్. ఈ విషయంలోనే విలన్ కు, శంకర్ కు మధ్య గొడవలు అవుతుంటాయి. ఇదే సమయంలో ఈ కేసును ఛేదించాలని సిబిఐ ఆఫీసర్ అరుణ్ శంకర్ కు బ్రెయిన్ లో ఒక సిమ్ కార్డు పెడతాడు. అతనికి న్యూరాలజిస్ట్ క్యారెక్టర్ చేసిన నిది అగర్వాల్ హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో ఆమెతో ప్రేమలో పడతాడు శంకర్. సహాయం చేస్తుంది. అసలు సిబిఐ ఆఫీసర్ శంకర్ కు ఎందుకు సిమ్ కార్డు పెట్టాడు. అసలు ఆ ప్లాట్స్ కు శంకర్ కు ఏంటి సంబంధం. అసలు శంకర్ ఎవరిని చంపాలనుకున్నాడు. అనేదే మిగతా కథ.

Image result for ismart shankar images

విశ్లేషణ….
ఇక కథనం విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తం హీరో రామ్ కనపడతాడు. అతని నటన అందరికి నచుతుంది. కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే లవ్ ట్రాక్ నడపడానికి తప్ప పెద్దగా ఉపయోగం లేదని అనిపిస్తుంది. నిధి అగర్వాల్ కథలో కీలకం అయినా కానీ ఆమెకు యాక్టింగ్ చేసేంత స్కోప్ రాలేదు. ఇక నభా నటేష్ తెలంగాణ అమ్మాయిగా బాగానే చేసింది. కానీ లవ్ ట్రాక్ కోసమే ఆమెను వాడుకున్నాడు. డైరెక్టర్ గ్లామర్ కు మాత్రమే హీరోయిన్స్ ను ఉపయోగించుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ పాత పంథాలోనే సినిమాను తీసుకెళ్లాడు. బాడీలో సిమ్ కార్డు పెట్టడం అనేదే కొత్త కానీ కథనం మాత్రం రొటీన్ గానే ఉంది. ఈసారి పూరి మ్యాజిక్ చేస్తాడని అనుకున్నారు కానీ చెయ్యలేకపోయాడు. డైలాగ్స్ బాగున్నాయి వినడానికి కొత్తగా అనిపించాయి కానీ కథనం ఇంకా మంచిగా ఉంటె సినిమా అదిరిపోయేది. ఇక నటీనటుల విషయానికి వస్తే..హీరోయిన్స్ నభా నటేష్ నటన బాగుంది. నిది అగర్వాల్ పర్వాలేదనిపించింది. షియాజీ షిండే, సత్యదేవ్, దీపక్ మిశ్రా తమ క్యారెక్టర్స్ కు తగిన న్యాయం చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమి లేదనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ను అనుకున్నంతగా తీయలేదు. చాలా సింపుల్ గా క్లైమాక్స్ ను ఫినిష్ చేశాడు. రొటీన్ పద్దతిలో క్లైమాక్స్ కంప్లీట్ చేశాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మణిశర్మ 100 శాతం మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఇక నిర్మాణం విషయానికి వస్తే ఎక్కడా కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఖర్చు చేశాడు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ప్లస్ పాయింట్స్…
హీరో రామ్,నభా నటేష్, రచన, ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,…

మైనస్ పాయింట్స్…
రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్, డైరెక్షన్…