తన బయోపిక్ లో తానే నటించబోతున్న స్టార్..!

400

ప్రస్తుతం టాలివుడ్ బాలివుడ్ లలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది..అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే…బాలివుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మాన్, సంజు లు కూడా భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి..దీంతో తెరపైకి మరిన్ని బయోపిక్ లను తీసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు…ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కూడా నిర్మితమవుతోంది..

ఈ కోవలోని భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన క్రీడాకారులు సైనా నెహ్వాల్ – సానియా మీర్జా – మిథాలీ రాజ్ ల బయోపిక్ లు కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిలో భారత టెన్నిస్ స్టార్ సానియా బయోపిక్ పై భారీ అంచనాలున్నాయి. టెన్నిస్ లో సానియా విజయాలు….కెరీర్….గ్లామర్ డాల్ గా సానియాకున్న పేరు…ఎంగేజ్ మెంట్ బ్రేకప్ …పాక్ క్రికెటర్ షోయబ్ ను వివాహం చేసుకోవడంపై విమర్శలు…. జాతీయత…. ఇటువంటి అంశాల నేపథ్యంలో ఈ బయోపిక్ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సానియా పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో….ఆ బయోపిక్ లో సానియానే నటించబోతోందని బాలీవుడ్ లో పుకార్లు వస్తున్నాయి. ఆ బయోపిక్ లో నటించాల్సిందిగా సానియాను ఆర్ ఎస్ వీ పీ ప్రొడక్షన్స్ వారు అప్రోచ్ అయినట్లు గాసిప్స్ వస్తున్నాయి. అయితే తమ బయోపిక్ కాపీరైట్స్ కోసం ఇప్పటివరకు ఏ భారతీయ సెలబ్రిటీ అందుకోనంత పెద్ద మొత్తం సానియా అందుకుంది. తాజాగా ఆమె పాత్రలో ఆమే నటించేలా ఒప్పించేందుకు కూడా భారీ మొత్తంలో ఇచ్చేందుకు సదరు నిర్మాతలు సిద్ధపడుతున్నారట. సానియా చాలా అందగత్తె అని పైగా నటనలో కొంత అనుభవం ఉందని…మిగతాది నేర్చుకొని ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అయితే ఇప్పటివరకు సానియా…అందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కానీ కళ్లు చెదిరే మొత్తాన్ని నిర్మాతలు ఆఫర్ చేయడంతో….సానియా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మరి తన బయోపిక్ లో తానే నటించి `ఆటో బయోపిక్`వంటి అరుదైన ఘనత సానియా దక్కించుకుంటుందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.