టాలీవుడ్ లో విషాదం ప్రముఖ నిర్మాత కన్నుమూత

569

టాలీవుడ్ లో వ‌రుస విషాదాలు అలుముకుంటున్నాయి.. సినిమా చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అక్ష‌రాలు లిఖించిన అనేక మంది సీనియ‌ర్లు ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ కన్నుమూశారు….. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు.

Image result for కోటిపల్లి రాఘవ

ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 105 సంవ‌త్స‌రాలు ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోల్‌కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ఆ బ్యానర్‌లో ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. తాతామనవడు,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సంసారం సాగరం,జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, జగత్ జంత్రీలు, వంటి సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు.

Image result for కోటిపల్లి రాఘవ

దర్శక రత్న దాసరితో పాటూ ఎంతోమంది నటుల్నిద‌ర్శ‌కుల్ని టెక్నిషియ‌న్ల‌ని ఆయ‌న తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాదు ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు . 1972లో తాతమనవడు.. 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు వచ్చింది. కె.రాఘవ మృతిపై టాలీవుడ్‌తో పాటూ పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఆయ‌న సినిమాల్లో న‌టించిన వారు తొలినాళ్ల‌ల్లో సాధార‌ణంగా ఉన్నా త‌ర్వాత స్ధానంలో ఎంతో పైకి వ‌చ్చారు ఆయ‌న మొద‌టతీసిన సినిమాలు ఆయ‌న‌కు ఎంతో గుర్తింపుని తీసుకువ‌చ్చాయి… తెలుగు ఇండ‌స్ట్రీలో ఆయ‌న ప్రొడ‌క్ష‌న్ కి మంచి పేరు ఉండేది. ఆయ‌న మృతితో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఓ గొప్ప వ్య‌క్తిని కోల్పోయామ‌నే బాధ‌లో ఉంది.