గుండెల్లో పొడుద్దాం అనుకున్నా.. పోలీసుల విచారణలో హంతకుడి మాటలు వింటే షాక్

703

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వైసీపీ నేత మల్లా విజయప్రసాద్‌ చెప్పిన దాని ప్రకారం…. జగన్‌ కాఫీ తాగుతున్న సమయంలో సిబ్బంది వచ్చి విమానానికి టైం అయింది సర్‌ రండి అంటూ పిలిచారు. దీంతో జగన్‌ వెళ్లేందుకు పైకి లేచి ఒక అడుగు ముందుకేశారు.అప్పటి వరకు దాడి చేసిన శ్రీనివాస రావు కొంచెం దూరంలో ఒక వాటర్ బాటిల్‌ పట్టుకుని నిలబడ్డారు. జగన్‌ లేచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో శ్రీనివాస్ రావు ఒక్కసారిగా జగన్‌ వద్దకు వచ్చి కత్తితో మెడపై పొడిచేందుకు ప్రయత్నించాడు. కాని అత‌ను గుండెళ్లో దించ‌డానికి ప్ర‌య‌త్నించాడు అని కుద‌ర‌క మెడ‌పై పెట్టాలి అని అనుకున్నాడు అని చెబుతున్నారు అత‌ను చేతి వాటం అలాగే పెట్టాడు అని చెబుతున్నారు వారు. మ‌రోసారి కూడా పొడ‌వ‌డానికి ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో కూడా అత‌ను గ‌ట్టిగా పోటు వెయ్యాలి అని చూశాడు అని చెబుతున్నారు ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు.

Image result for jagan

ఈ సంఘ‌ట‌న‌లో పార్టీలోని సీనియర్ నాయకుడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బియ్యపు మధుసూనరెడ్డి ప్రయత్నంతోనే ప్రాణాపాయం తప్పినట్లుగా తెలుస్తోంది.. దీనికి కార‌ణం కూడా చెబుతున్నారు. జ‌గన్ విమానం ఎక్క‌డానికి లేచి బ‌య‌లు దేరుతున్నారు, ఈ సమయంలో శ్రీకాళహస్తి వైసీపీ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూధన్‌ రెడ్డి… విజయవాడ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని పరిచయం చేసేందుకు జగన్‌ను పిలిచారు. దీంతో జగన్‌ ఒక్కసారిగా మధు వైపు తిరిగారు. దాంతో మెడపై పడాల్సిన వేటు భుజంపై పడింది. కత్తి లోతుగా దిగింది అని వారు చెబుతున్నారు.కాని అత‌ని చేతివాటం చూసిన‌ట్లు అయితే గుండెల్లో పొడ‌వ‌టానికి చూసిన‌ట్టుకూడా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు వైసీపీ నేత‌లు.

Image result for jagan

అప్పటి వరకు అతడి వద్ద కత్తి ఉందన్న విషయాన్ని కూడా గమనించలేకపోయారు. తొలి వేటు భుజంపై పడడంతో వెంటనే మరోసారి పొడిచేందుకు ప్రయత్నించగా…. అక్కడే ఉన్న కరణం ధర్మశ్రీ, మల్లా విజయప్రసాద్‌ శ్రీనివాస్‌ను తోసిపడేశారు. వెంట‌నే జ‌గ‌న్ సెక్యూరిటీ ఆయ‌న పీఏ అల‌ర్ట్ అయ్యారు. అక్క‌డ పోలీసులు కూడా వెంట‌నే అక్క‌డ‌కు వ‌చ్చి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.. శ్రీనివాస రావు పనిచేస్తున్న క్యాంటీన్‌ ఓనర్‌ తొట్టంపూడి హర్షవర్థన్ … మంత్రి నారా లోకేష్‌కు చాలా సన్నిహితంగా ఉంటారని…. గాజువాక టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారని మల్లా విజయప్రసాద్‌ వివరించారు.

 

విజయవాడ వ్యక్తిని పరిచయం చేసేందుకు జగన్‌ను బియ్యపు మధుసూధన్ రెడ్డి పిలిచి ఉండకపోతే కత్తిపోటు నేరుగా జగన్‌ మెడపై లేదా అత‌ను గుండెల్లో దింప‌డానికి ప్ర‌య‌త్నించేవాడు అని చెబుతున్నారు.. ఆ కత్తి చాలా పదునుగా ఉందని ఆయన వివరించారు. దాడి చేసిన తర్వాత నేను ఈ రోజు కోసం ఐదు నెలలుగా ఎదురు చూస్తున్నా… నన్ను అరెస్ట్ చేయండి అంటూ శ్రీనివాస రావు కేకలు వేశారని కరణం ధర్మశ్రీ వివరించారు.మ‌రి ఇంత‌లా జ‌రిగిన దారుణంపై మీ అభిప్రాయం ఏమిటి… దీని వెనుక ఉన్న‌ది ఎవ‌రు అని మీరు భావిస్తున్నారు, కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.