పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ షాకింగ్ విషయం.. ఝాన్సీ మూడు నెలల గర్భవతి..

330

వెండితెర బుల్లితెర మీద నటించి మనల్ని అలరించే నటీనటులు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్దమాన టీవీ నటి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఝాన్సీ. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Image result for actress jhansi

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది.అయితే ఝాన్సీ బలవన్మరణానికి ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. అయితే ఆమె మృతదేహంకు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టంలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె మూడు నెలల కడుపుతో ఉన్నట్టు తేలింది. అయితే ఆ కడుపుకు కారణం నాని అనే అందరి అనుమానం. ఈ విషయంలోనే నానికి ఝాన్సీకి మధ్య గొడవ అయినట్టు తెలుస్తుంది. కడుపు ఉండటం వలనే పెళ్లి చేసుకో అంటే నాని చేసుకోను అన్నాడని ఆ విషయానికి ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది.

పెళ్లి చేసుకోకుంటే చనిపోతా అని ఝాన్సీ నాని దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. అయినా కానీ నాని ఒప్పుకోలేదని చనిపోతే చనిపో అని నాని అన్నట్టు కూడా తెలిసింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలుసు అని అంటున్నా కానీ మాకు తెలియదని ఝాన్సీ తల్లిదండ్రులు అంటున్నారు.చూడాలి మరి పోలీసులు ఎవరిని దోషులుగా తేలుస్తారో. మరి ఝాన్సీ ఆత్మహత్య గురించి అలాగే నానికి ఝాన్సీకి మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.