నాకు తెలుగులో నచ్చిన సినిమాలు ఆ రెండే..ఇలియానా

561

టాలీవుడ్‌కు దేవదాసు చిత్రంతో అరంగేట్రం చేసి.. ఆపై స్టార్ హీరోలతో నటించిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసింది.మళ్ళి దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత తెలుగు తెర‌కు రీ-ఎంట్రీ ఇస్తోంది ఇలియానా. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇలియానా తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించింది.వార‌డిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చింది.`తెలుగులో మీరు న‌టించిన సినిమాల్లో మీకు బాగా న‌చ్చిన సినిమా ఏది` అని ఓ అభిమాని ఇలియానాను ప్ర‌శ్నించాడు. దీనికి స్పందిస్తూ.. `తెలుగులో నేను న‌టించిన సినిమాల్లో నాకు న‌చ్చినవి రెండు ఉన్నాయి. `జ‌ల్సా`, `కిక్‌` సినిమాలు నాకు చాలా ఇష్టం` అని చెప్పింది.

అలాగే త‌న ప్రియుడు, ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూను పిచ్చిగా ప్రేమిస్తున్నాన‌ని, అత‌ని రంగు, దేశంతో త‌న‌కు ప‌నిలేద‌ని స‌మాధానం ఇచ్చింది. ఆండ్రూను త‌న జీవిత భాగాస్వామిగా పేర్కొంది.త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పింది.