మీరు విదేశియుడిని ఎందుకు ప్రేమించారు అంటే ఇలియానా ఏమని సమాధానం చెప్పిందో చూడండి..

473

టాలీవుడ్‌కు దేవదాసు చిత్రంతో అరంగేట్రం చేసి.. ఆపై స్టార్ హీరోలతో నటించిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. బాలీవుడ్‌లో నాలుగైదు సినిమాలు చేసిన ఈ సన్నపిల్ల ప్రస్తుతం విదేశీ బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. తన అందచందాలను ఆమె బాయ్‌ఫ్రెండ్ తీసిన ఫోటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 

విదేశీ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న ఇలియానా చాలారోజుల కిందట హబ్బీ అని పోస్ట్‌ చేసి, ఇటీవల పోస్ట్‌లో మాత్రం మై లవ్‌ అని సంబోధించారు. తాజాగా ప్రియుడు నీబోన్‌తో డేటింగ్‌, పెళ్లి లాంటి విషయాలపై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఇలాయానా చక్కగా బదులిచ్చారు.ఓ విదేశీయుడితో మీరు ఎందురు డేటింగ్‌ చేస్తున్నారు, అతడిని మీ జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ పోస్ట్‌ చేశారు.

 

‘ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి శరీర రంగు,ఏ దేశం లాంటి విషయాలు నాకు అనవసరం’ అంటూ ఇలియానా బదులిచ్చారు. ప్రేమ, పెళ్లి గురించి తనను అడిగిన ప్రశ్నకు నటి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారంటూ ఇలియానా ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.