మాటల మాంత్రికుడిని కలిసిన ఇలియానా..నెక్స్ట్ సినిమా కోసమేనా?

322

ఇలియానా ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఆరేళ్ళ తరువాత ఈ భామ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో ఇలియానా నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 16న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం ఇలియానా ఇటీవల హైదరాబాద్ వచ్చింది. పలు ఇంటర్వ్యూలతో బిజీగా గడిపిన ఇలియానా ఇండస్ట్రీలోని పాత మిత్రులని కలసినట్లు వార్తలు వస్తున్నాయి.

amar akbar anthony ‘don bosco’ song name to be changed!

ఇలియానా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలసినట్లు తెలుస్తోంది.ఇలియానా, త్రివిక్రమ్ ని కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఇలియానాకు ఇప్పుడు సినిమాలు లేవు.బాలీవుడ్ లో ట్రై చేసిన ఎవరు అవకాశం ఇవ్వడం లేదు.అందుకే టాలీవుడ్ వైపు తిరిగింది.

Related image

త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో అవకాశం ఉంటుందేమో తెలుసుకుందామని త్రివిక్రమ్ ను కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే జల్సా,జులాయి వచ్చాయి.మరి ఇలియానా రిక్వెస్ట్ కు త్రివిక్రమ్ యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూడాలి.