నన్ను ఎవరు పెళ్లిళ్లకు పిలవవద్దంటున్న స్టార్ హీరో ఇళయదళపతి విజయ్..

331

ఇటీవల పాండిచ్చేరిలో విజయ్ తన అభిమాన సంఘం అధ్యక్షుడి కుమార్తె వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. విజయ్ వస్తున్నాడని ముందుగా తెలియడంతో అక్కడికి అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు.రాత్రి నుంచే అక్కడ కాపలా కాసిన వాళ్ళు ఉన్నారు.

Star hero Vijay Dont want to attend any marriages

అయితే విజయ్ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఒకేసారి కొన్ని వందల మంది రావడంతో అక్కడ గందరగోళం జరిగింది.అయితే పోలీసులు వేగంగా స్పందించారు కాబట్టి సరిపోయింది. లేకుంటే పెళ్లి మండపంలో అనర్థాలు జరిగేవి.సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలు తన రాకతో ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడం వలన ఇకపై పెళ్లిళ్లకు హాజరు కాకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడు.

Image result for ilayathalapathy vijay

నన్ను ఎవరు పెళ్లిళ్లకు పిలవవద్దని విజయ్ అభిమానులందరికి తెలియజేసాడు.మన వల్ల ఏమైనా జరిగితే ఆ బాధ మనకే ఉంటుంది కదా.అందుకే విజయ్ ప్రస్తుతం బాధలో ఉన్నాడు.ఆ బాధలోనే ఇలా అన్నాడు..