ఒకప్పుడు డబ్బుల కోసం యాంకర్ విష్ణుప్రియ ఏం చేసేదో తెలిస్తే షాక్..

476

రంగుల ప్రపంచంలో గుర్తింపు రావాలంటే ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కానీ..చాలా మంది సినిమా కష్టాలు,సీరియళ్ కష్టాలు పడి వచ్చినవాళ్లే..తెలుగు టీవి యాంకర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ,అనసుయ,రష్మిలే..స్మాల్ స్క్రీన్ ని దున్నేస్తున్నారు. చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ వీరిలా ఓకే ప్రోగ్రాంలో ఏళ్లకేళ్లు ఉండిపోలేదు..ఇప్పుడు వీళ్లకు పోటీగా అనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ. యాంకరింగ్ అనేది చాలా రిస్క్ జాబ్. తమవైన అందచందాలతో మత్తు చల్లుతూనే మాటల గారడీతో కట్టిపడేయడమే యాంకరింగ్ స్కిల్. చూస్తున్నంత సేపు తమను మాత్రమే కళ్లన్నీ వెతకాలి. తాము ఏం చెబితే అది జోలపాటలా వినాలి. అప్పుడే బెస్ట్ యాంకర్ గా గుర్తింపు. అలాంటి లక్షణాలన్నీ యాంకర్ విష్ణుప్రియలో ఉన్నాయి కాబట్టే ఇప్పుడు విష్ణుప్రియా హవా కొనసాగుతుంది.

Image result for vishnu priya

తెలుగు బుల్లితెర పై వ‌స్తున్న పోవే పోరా ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ అంతకు ముందు ఎవరీకి తెలియదు. ఈ ప్రోగ్రాం కన్నా ముందు సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటించింది విష్ణుప్రియ. అయితే త‌న‌కి ఇప్పుడొచ్చినంత పేరు రాలేదు.. తన స్పాంటేనియ‌స్ మాట‌ల‌తో అందరిని ఆకట్టుకుంటుంది. తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ అటు కుర్రకారుని ఇటు పెద్దవారిని తన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటుంది.బుల్లితెర మీద సుదీర్ విష్ణుప్రియకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ అందరికి తెలిసిందే.కేవలం పోరాపోవే షో మాత్రమే కాదు వాళ్ళిద్దరి స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా హైలెట్ గా నిలుస్తాయి. కేవలం యాంకర్ గానే కాదు గ్లామర్ గా కూడా విష్ణుప్రియ అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ఈమధ్య కాలంలో ఆమె చేసే డాన్స్ పర్ఫార్మెన్సెస్ హైలెట్ గా నిలుస్తున్నాయి. భవిష్యత్ లో బుల్లితెర నుంచి వెండితెరకు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక విష్ణు ప్రియకి సంభందించిన ఒక మ్యాట‌ర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అదే డబ్బుల కోసం తను భగవద్గీత చెప్పేదని. చిన్ననాటి నుండి తన తాతగారి దగ్గర భగవద్గీతలోని అన్ని అధ్యయనాలు నేర్చుకుందట‌. అవే పిల్లలకు చెప్పేది.. అలా చెప్పడానికి తను ఎంత తీసుకునేది తెలుసా? ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందల రూపాయలు. అదే భగవద్గీతకి సంభందించిన కాంపిటీషన్ష్‌లోనూ, ప్రోగ్రామ్స్ లోనూ తను బొలెడు అవార్డులు కూడా గెలుచుకుంది. ఏదైతేనేమి కష్టపడి పైకొచ్చిన విష్ణుప్రియ మరింతగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఆమె కెరీర్ అద్భుతంగా ఉండి మనల్ని ఇంకా అలరించాలని కోరుకుందాం. మరి విష్ణుప్రియ గురించి ఆమె బుల్లితెర మీదకు రావడం కంటే ముందు భగవద్గీతను బోధించిన విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.