వీళ్ళ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. టాప్ లో ఎవరు ఉన్నారో చూడండి

315

ఒక్కప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలు కూడా తీసుకోనంతగా రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు ప్రస్తుత తెలుగు హీరోయిన్లు. వీరిలో సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకోలేని నార్త్ అమ్మాయిలకు కోట్ల పారితోషికం ఇస్తున్నారు మన టాలీవుడ్ నిర్మాతలు. మన తెలుగు పరిశ్రమలో అప్పట్లో మల్లీశ్వరి సినిమాకి హీరోతో సమానంగా పారితోషికం తీసుకొని వార్తల్లో నిలిచింది కత్రినా కైఫ్. 2004 – 05 సమయంలొనే కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంది.ఇప్పుడు ఆమెకి ధీటుగా ప్రస్తుత హీరోయిన్ లు ఒక్కో సినిమాకు నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు.మరి ఎవరు ఎంత తీసుకుంటున్నారు. ఎవరు టాప్ లో ఉన్నారో చూడండి.

Image result for samantha

1)కోటి రూపాయల భామలు నయన తార, అనుష్క
ప్రస్తుతం 35 ఏళ్ళకి పై ఉన్న నటీమణులు నయనతార , అనుష్క లు ఇప్పటికి ఒక సినిమా చేస్తే కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అనుష్క ఒక్కో సినిమా కి 3 నుండి 4 కోట్లు తీసుకుంటుండగా , సైరా సినిమా కోసం నయన తార ఏకంగా 3.5 కోట్లు తీసుకుంటుందట.
2)సమంత అక్కినేని
పెళ్ళైనక మరిన్ని సినిమాలు తీస్తూ హిట్ లు కొడుతున్న సమంత ఈ మధ్య విడుదలై నాగ చైతన్య కి భారీ విజయాన్ని అందించిన మజిలీ సినిమా కోసం ఆమె 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది.


3)కాజల్ అగర్వాల్
ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు దాటిన కాజల్ కి ఇంకా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం కాజల్ సినిమాకి 2 కోట్ల వరకు పారితోషికం గా తీసుకుంటుంది.
4)తమన్నా భాటియా
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక్కో సినిమాకి భారీగానే వసూలు చేస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కి విడుదలై బ్లాక్ బస్టర్ అయి 100 కోట్ల కలెక్షన్ లు సాధించిన ఎఫ్ 2 కోసం తమన్నా 1.5 కోట్లు తీసుకుంది.

Image result for kajal


5)రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులో వరసగా సినిమాలు తీస్తున్న హీరోయిన్ ఈ మధ్య గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ లో సినిమాలు తీస్తుంది. ప్రస్తుతం ఈ పంజాబీ అమ్మాయి సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటుంది.వీళ్ళేకాకుండా ఫిదా తో తెలుగు ప్రేక్షకుల మనస్సులు దోచుకున్న సాయి పల్లవి సినిమాకి కోటి వరకు తీలుకుంటుంది. అరవింద సమేత సినిమా హిట్ తరువాత మహేష్ తో పాటు ప్రభాస్ తో నటిస్తున్న సినిమాల కోసం 70 నుండి 90 లక్షల పారితోషకం తీసుకుంటుంది.ఇలా మన టాలీవుడ్ హీరోయిన్స్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు. మరి ఈ హీరోయిన్స్ గురించి వారి రెమ్యునరేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.