గూగుల్ లో బాలకృష్ణ అని సెర్చ్ చేస్తే ఏమని చూపిస్తుందో తెలిస్తే కోపం రావడం పక్కా

102

గూగుల్ అనేది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మనం అనుకుంటాం.మనకు ఏమి కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అందులో ఏమి ఉంటె అదే కరెక్ట్ అనుకుంటాం.అంత నమ్మకం మనకు గూగుల్ మీద.అయితే అన్నిసార్లు సరైన సమాధానమే చెప్తుందా అంటే చెప్పదు.ఒక్కొక్కసారి తప్పుడు సమాచారాన్ని కూడా ఇస్తుంది.ఎన్నోసార్లు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఫూల్స్ చేస్తుంది.అయితే ఇది గూగుల్ వాళ్ళ తప్పు కాదు హ్యాకర్స్ తప్పు.ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ ను తప్పుగా చూపిస్తుంది.సినీ నటుడు బాలకృష్ణ వివరాలు తప్పుగా చూపిస్తుంది.మరి ఆ విషయాల గురించి తెలుసుకుందామా.

Related image

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి తెలియని వారు ఉండరు.35 ఏళ్లుగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరో అయ్యాడు.ప్రస్తుతం దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న మూవీ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాల్లో విడుదలకానుంది. రెండో భాగం రెండు వారాల వ్యవధిలో విడుదల అవుతుంది. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపిస్తారు, రెండో భాగంలో రాజకీయ జీవితం తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చంద్రబాబు గా రానా పోస్టర్, అక్కినేని నాగేశ్వర రావు గా సుమంత్ పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా సావిత్రిగా కీర్తి సురేష్, జయప్రదగా రాశి ఖన్నా,శ్రీదేవిగా రకుల్ ప్రీత్ నటిస్తున్నారు.ఇది ఇలా ఉండగా గూగుల్ వికీపీడియా లో బాలకృష్ణ గురించి తప్పుగా ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణ చనిపోయింది 1995 లో తప్పుగా ఉంది. ఈ విషయంపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది నందమూరి తారక రామారావు గారి చనిపోయిన సంవత్సరం. అది తప్పుగా చూపిస్తుంది. గూగుల్ వికీపీడియాలో ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. ఇలాంటి దుష్క్యర్యకు పాల్పడింది ఎవరో మరి.అయితే వీటిని వెంటనే కరెక్ట్ చెయ్యాల్సిన భాద్యత గూగుల్ దే.మరి ఎప్పుడు కరెక్ట్ చేస్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.గూగుల్ గురించి అలాగే అప్పుడప్పుడు అందులో వచ్చే తప్పుల గురించి ఇప్పుడు బాలకృష్ణ మీద వచ్చిన తప్పుడు ఇంఫార్మేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.