జబర్దస్త్ కోసం మీనా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్

454

దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా బుల్లితెరమీద కామెడీతో అలరిస్తున్న జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్‌లో ఆరుగురు టీములు రకరకాల స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోలో స్కిట్స్‌కి వచ్చే స్పందన ఎంత ఉంటుందో…అంతకు మించి స్పందన ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాకూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఇంత‌గా స‌క్సెస్ అయిందంటే కార‌ణం కంటెస్టెంట్‌లతో పాటు జడ్జీలు నాగబాబు,రోజా. కామెడీ వ‌చ్చినా లేక‌పోయినా వాళ్ళ న‌వ్వులు,కంటెస్టెంట్‌లపై వేసే సెటైర్లకు ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డిపోయారు. అలాంటి నాగబాబు,రోజా లేకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే. అయితే ఇకపై వారిద్దరు జబర్దస్త్ స్టేజ్‌పై కనించరు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకొచ్చింది మల్లెమాల. ఏప్రిల్ 5న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో కొత్త జడ్జీలను ఇంట్రడ్యూస్ చేసేశారు. అలనాటి నటి మీనాతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ ఇకపై జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు జడ్జిలుగా వ్యహరించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Image result for heroin meena

జబర్దస్త్ జడ్జిలైన ఫైర్ బ్రాండ్ రోజా, నాగ‌బాబు ఇప్పుడు రాజ‌కీయాల్లోనే ఉండ‌టంతో వారు ఈ షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. న‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మరోసారి ఇక్కడి నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా పవన్ స్ధాపించిన జనసేనలో చేరిన మెగా బ్రదర్ నాగబాబు ఆ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో వీరిద్దరు ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో వీరి స్ధానంలో జడ్జీలుగా మీనా,శేఖర్ మాస్టర్‌ని తీసుకొచ్చింది మల్లెమాల.అయితే నాగబాబు,రోజా ఇద్దరు ఎన్నికలయ్యేంత వరకు మాత్రమే జబర్దస్త్‌కి దూరమవుతారా లేక పర్మినెంట్‌గా షో నుండి తప్పుకున్నారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఈ షోకు రోజా ప్లేస్ లో జడ్జిగా వచ్చింది మీనా. ఈమె అందంతో పాటు నటన డాన్స్ అన్నిట్లో నెంబర్ వనే. గ్లామర్ రంగంలో నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగింది. పెళ్లి చేసుకుని ఫామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న మీనా చాలారోజుల తర్వాత ఇలా బుల్లితెర మీద సందడి చెయ్యడానికి సిద్దపడింది.అయితే జబర్దస్త్ చెయ్యడానికి మీనా భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. రోజాతో కంపేర్ చేసుకుంటే ఎక్కువనే తీసుకుంటుంది.రోజా ఒక్క ఎపిసోడ్ కు లక్ష రూపాయలు తీసుకుంటే మీనా లక్షన్నర తీసుకుంటుందంట. మీనా వచ్చే ఎపిసోడ్స్ అన్ని స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి షోకు బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి మీనా అయితే రేటింగ్స్ ఇంకా పెరుగుతాయని మల్లెమాల వాళ్ళు ఇంత భారీ మొత్తంలో మీనా అడిగినా కూడా ఇచ్చారంట. మరి మీనా జబర్దస్త్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.