అనుష్కతో డేటింగ్ గురించి ఎట్టకేలకు నోరువిప్పిన ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే షాక్

769

అనుష్క ప్రభాస్ మధ్య ఏముంది..లవ్వా లేక కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనా.. ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి వచ్చినన్ని వార్తలు మరెవరి గురించి రాలేదు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాహుబలి సినిమా సమయంలో ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడిందని రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు ఈ ఇద్దరు స్పందించలేదు. ఇన్నాళ్లకు ప్రభాస్ ఈ విషయం మీద నోరువిప్పారు. మరి ప్రభాస్ ఏమన్నాడో చూద్దామా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్రేజీ హీరో. దేశవ్యాప్తంగా ప్రభాస్ చిత్రాల కోసం అభిమానులు ఎందురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం ప్రభాస్ కు అంతలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో దూసుకుపోతోంది. ప్రముఖ సెలెబ్రిటీలతో కరణ్ జోహార్ నిర్వహిస్తున్న చిట్ చాట్ కార్యక్రమానికి మంచి క్రేజ్ వచ్చింది. కరణ్ జోహార్ తొలిసారి సౌత్ సెలెబ్రిటీలతో ఈ షో నిర్వహించారు. బాహుబలి త్రయం రాజమౌళి, ప్రభాస్ రానా ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఈ షోలో ప్రభాస్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ గురించి కూడా ప్రస్తావించాడు.అనుష్కతో డేటింగ్ అంటూ వస్తున్న రూమర్స్ గురించి కరణ్ జోహార్ ప్రభాస్ ని ప్రశ్నించాడు. అలాంటిది ఏమీ లేదని.. ఆవార్తల్లో వాస్తవం లేదని ప్రభాస్ బదులిచ్చాడు. ఏ ఇద్దరు నటులైనా రెండేళ్లకు పైగా కలసి పనిచేస్తే సహజంగానే వారిద్దరి మధ్య లింక్ ఉన్నట్లు ప్రచారం చేస్తారని ప్రభాస్ తెలిపాడు. కానీ మా ఇద్దరి మధ్య లాంటిది లేదు. కావాలంటే రాజమౌళిని అడగండి అని ప్రభాస్ తెలిపాడు. రానా కలగజేసుకుని ప్రభాస్, అనుష్క డేటింగ్ లో లేరని తెలిపాడు.

Image result for prabhas and anushka

ప్రభాస్ వివరణపై కరణ్ జోహార్ సరదాగా స్పందించారు. అనుష్క నీకు బాహుబలిలో భార్యగా, తల్లిగా రెండు పాత్రల్లో నటించింది. ఇది కొంచెం కష్టమే అని కరణ్ జోహార్ తెలిపాడు. ప్రభాస్ స్పందిస్తూ.. అవును.. అలాంటప్పుడు ఆమెతో డేటింగ్ ఎలా చేస్తాను అని ప్రభాస్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ప్రభాస్, అనుష్క వివాహానికి సిద్ధం అవుతున్నారు అంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా ప్రభాస్ కరణ్ జోహార్ కు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ లో సెక్సియెస్ట్ నటి ఎవరు అని ప్రశ్నించగా.. అనుష్క అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. అనుష్క, కాజల్, తమన్నా.. ఈ ముగ్గురిలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకుంటావు అని ప్రశ్నించగా.. అనుష్క అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. ఇందులో ఎలాంటి రూమర్ లేదు.. ఆమె నాకు చాలా ఏళ్లుగా స్నేహితురాలు, నటిగా కూడా అనుష్క బెస్ట్. నాకే కాదు రాజమౌళికి కూడా అనుష్కనే ఫేవరేట్ నటి అని ప్రభాస్ తెలిపాడు.ఇలా అనుష్కతో ఉన్న బంధం గురించి ప్రభాస్ చెప్పాడు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అనుష్కతో ఉన్న బంధం గురించి ప్రభాస్ ఇచ్చిన వివరణ గురించి అలాగే ప్రభాస్ చెప్పింది నిజమేనా..వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.