నా తండ్రి ప్రాణం తీసిన పొలం నాకొద్దు.. ఈ 250 ఎకరాలు ఎన్టీఆర్ ఏం చేసాడో తెలిస్తే షాక్!

716

నందమూరి హరికృష్ణ మరణంతో అటు సినీ లోకం ఇటు రాజకీయ రంగంలో విశాదచాయలు అలుముకున్నాయి.ముఖ్యంగా నందమూరి వంశంలో ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కాయి.నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా నందమూరి వంశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి చర్చ జరుగుతోంది.మరి ఆ చర్చ దేని గురించో తెలుసుకుందామా.

Image result for hari krishna dead body

నాలుగేళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై జూ. ఎన్టీఆర్ గాయపడ్డాడు. క్షేమంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు.ఇప్పుడు మళ్ళి రోడు యాక్సిడెంట్ లోనే హరికృష్ణ మరణించాడు.అయితే దీని గురించి ఒక చర్చ నడుస్తుంది..అదేమిటి అంటే..ఎన్టీఆర్ కుటుంబ నేపథ్యం, తన తండ్రి సమయంలో జరిగిన పరిస్థితుల గురించి హరికృష్ణకు పూర్తి అవగాహన ఉంది.తన తాత లక్ష్మయ్య చౌదరి కాలం నుంచే ఈ ప్రమాదాలు నందమూరి కుటుంబాన్ని వేధిస్తున్నాయనే విషయం హరికృష్ణకు తెలుసు. గతంలో ఓ ఇంటర్వ్యూ లో హరికృష్ణ ఈ విషయాన్ని తెలిపారు.ఆ ఇంటర్వ్యూ లో హరికృష్ణ మాట్లాడుతూ.. నాకు సిటీలంటే చిరాకు. నాన్న సినిమాలతో చెన్నై, హైదరాబాద్ తిరుగుతుండేవారు.

Image result for hari krishna dead body

నాబాల్యం మొత్తం నిమకూరులోనే గడిచింది. చుట్టం చూపుగా మాత్రమే నాన్న వద్దకు చెన్నై, హైదరాబాద్ వెళ్ళేవాడిని. నా ఇష్టాలకు అనుగుణంగానే తాతయ్య లక్షయ్య చౌదరి నన్ను నిమ్మకూరులోనే పెంచారు. తల్లి తండ్రి నాకు అన్నీ తాతయ్యే. నాన్న వద్దకు చెన్నై వెళ్లినా అక్కడ సిటీ వాతావరణం నాకు జైలుని తలపించేది. ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు. పల్లెటూరిలో పొలాలు, స్వచ్ఛమైన గాలి, నానమ్మ, తాతయ్య అనురాగం బాగా ఆస్వాదించేవాడిని. 1976 లో నాన్నగారు హైదరాబాద్ లో రామకృష్ణ స్టూడియో కట్టడం ప్రారంభించారు. అందువలన బలవంతంగా ఇక్కడకు రావలసి వచ్చింది. మొదట రానని మొండికేశా. నువ్వు ఇక్కడ అన్నీ చూసుకుంటావనే స్టూడియో కడుతున్నా. నీకు తోడుగా తాతయ్య కూడా ఇక్కడికే వస్తారు అని నాన్నగారు చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ మాటతో అంగీకరించా.హైదరాబాద్ కు వెళ్ళాక తాతయ్య ఒకసారి శంషాబాద్ సమీపంలో ఉన్న మా పొలాలు చూసి వస్తున్నారు. ఆ సమయంలో రాజేంద్ర నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతయ్య మరణించారు.నా తండ్రి ప్రాణం తీసిన పొలం నాకు వద్దు అంటూ నాన్నగారు 250 ఎకరాలు ఉన్నపళంగా అమ్మేశారు. ఇలా తన పాత జ్ఞాపకాలని హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. దీనిని బట్టి తాతల కాలం నుంచే నందమూరి వంశాన్ని ఈ ప్రమాదాలు వెంటాడుతున్నాయనే విషయం అర్థం అవుతోంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే నందమూరి కుటుంబంలో చాలా మంది రోడు ప్రమాదంలోనే మరణించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.