సచిన్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు న‌టి సంచ‌ల‌న స్టేట్ మెంట్

455

బాలీవుడ్ ప్రముఖ నటి, సాథ్‌ నిబానా సాథియా’(కోడలా కోడలా కొడుకు పెళ్లామా) సీరియల్‌ ఫెమ్ దెబోలినా భట్టాచార్య హత్య కేసులో విచారణను ఎదుర్కోవడం ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే రీసెంట్ గా ఒక మర్డర్ కేసులో నటికి సంబందించిన వివరాలు దొరకడంతో ఆమెకు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారించేందుకు ముంబై పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

Image result for సాథ్‌ నిబానా సాథియా

దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది దేవోలీనా. తనను పోలీసులు ప్రశ్నించడానికి మాత్రమే పిలిచారని, హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు విషయంలోకి వస్తే.. ముంబైకి చెందిన రాజేశ్వర్ ఉదాని అనే వజ్రాల వ్యాపారి గత కొద్దిరోజులుగా కనిపించడం లేదని అతడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో పోలీసులకు కుళ్లిపోయిన శవం దొరికింది. పోస్ట్ మార్టంలో అది రాజేశ్వర్ మృతదేహమని తేలింది. రాజేశ్వర్ కాల్ డేటా పరిశీలించగా.. రాజకీయనాయకుడు సచిన్ పవర్ అలానే అతడి ద్వారా కొంతమంది మహిళలతో రాజేశ్వర్ కి పరిచయం ఏర్పడిందని, వారిలో దేవోలీనా కూడా ఉందని గుర్తించారు. దీంతో సచిన్ పవర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలానే దేవోలీనాని కూడా అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన దేవోలీనా.. ”సచిన్ పవర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు నాకు స్నేహితుడు మాత్రమే.. పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు. ప్రశ్నించడానికి మాత్రమే పిలిచారు” అని చెప్పుకొచ్చింది. పోలీసులు కూడా దేవోలీనా తమతో లేదని క్లారిటీ ఇచ్చాడు. కేవ‌లం ఫోన్ డేలా ప‌రిశీలించి ఆమె నంబ‌ర్లు ఉండ‌టంతో ఆమెని విచారించాము అని ఆమెని అరెస్ట్ చేయ‌లేదు అనిపోలీసులు వెల్ల‌డించారు. మ‌రి ఈ కేసు విష‌యంలో మీడియాలో వచ్చిన వార్త‌ల్లో నిజం లేదు అని ఆమె మ‌రోసారి తెలియ‌చేశారు.