డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నానన్న రాధికా ఆప్టే..

411

చాలా మంది నటీనటులు తాము తమ ఆనందం కోసం నటిస్తున్నామని, తమకు నటన అంటే ప్రాణమని, కళ అంటే ప్రాణమిస్తామని.. అందుకే తాము సినిమాల్లో నటిస్తున్నామని చెబుతుంటారు. ప్రత్యేకించి డబ్బు గురించి పెద్దగా మాట్లాడరు. నటన మీద మక్కువతోనే నటిస్తున్నామని చెబుతుంటారు.మీరు సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడిని హీరోయిన్ ను అడిగినా ఇదే చెబుతారు.

radhika aapte కోసం చిత్ర ఫలితం

వీటన్నిటి తర్వాతే డబ్బు ముఖ్యమని చెబుతారు.అయితే అందుకు భిన్నంగా స్పందించింది రాధికా ఆప్టే.తను డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను అని రాధిక స్పష్టం చేస్తోంది.ఇప్పటికే తన బోల్డ్ యాక్టింగ్‌తో రాధిక సంచలనం రేపింది. నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడని నటీమణి ఈమె. ఇప్పుడు సినిమాల ఎంపికలో తను డబ్బుకే ప్రాధాన్యతను ఇస్తానని స్పష్టం చేస్తోంది.

radhika aapte కోసం చిత్ర ఫలితం

మంచి కథలు దొరకాలి, మంచి మంచి పాత్రలు రావాలి.. అని ఎదురుచూడను అని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని సినిమాలు చేస్తాను అని రాధిక చెబుతోంది. బతకడానికి, ఖరీదైన లైఫ్ స్టైల్ కోసం డబ్బులు అవసరమని అందుకే తను గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ పోతున్నాను అని రాధిక చెప్పింది.