పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

1025

జబర్దస్త్ ఎంతో మంది కమిడియన్స్ కు లైఫ్ ఇచ్చింది.జబర్దస్త్ లో చేసిన వాళ్ళు ఎన్నో సినిమాలలో నటిస్తూ నాలుగురాళ్లు వెనుక వేసుకుంటున్నారు.అలాంటివారిలో హైపర్ ఆది ఒకరు. ఆయన వేసే కామెడి పంచులు, డైలాగులు బ్రహ్మండంగా పేలుతాయి. అందుకే బుల్లితెర ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఆదికి ఉంది. ప్రస్తుతం నాలుగైదు టీవీ షోలలో పాల్లొంటూ ఆయన యమ బిజీగా మారిపోయారు.అయితే గత కొద్దిరోజులుగా ఆది జబర్దస్త్ చెయ్యడం లేదు.దానికి కారణం ఆది పెళ్లి అంట.త్వరలో ఆది పెళ్లి చేసుకోబోతున్నాడంట.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Related image

తక్కువ టైంలో జబర్దస్త్ నే శాసించే స్థాయికి వెళ్ళిన హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు టీవీల ముందు అతుక్కుపోతారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆది వేసే పంచుల కోసం ఎదురుచూస్తుంటారు. షో అయిపోయాక కూడా పదే పదే ఆది స్కిట్ లను యూ ట్యూబ్ లో చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. అంతటితో ఆగకుండా ఆ నవ్వులను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కి షేర్లు చేస్తుంటారు. కేవలం ఆది వేసే పంచుల కోసమే షో చూస్తారంటే ఆది రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.సమాజంలో జరుగుతున్న తప్పులను ఖండిస్తూ సెటైర్లు వేసి నవ్వించడమే ఆది స్టైల్.

Image result for hyper adhi

అలాంటి ఆది కొన్ని ఎపిసోడ్స్ నుంచి కనబడడం లేదు. దీంతో ఆది జబర్దస్త్ ను వదిలేశారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు, “హైపర్ ఆది – రైజింగ్ రాజు” అని ఉండాల్సిన టీం పేరు ఇప్పుడు రైజింగ్ రాజుగా వస్తుంది. దీంతో ఇక ఆది జబర్దస్త్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారన్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి.అయితే ఆది కావాలనే జబర్దస్త్ షో మానేశాడంట.దానికి కారణం ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత తన సొంత ఊరికి వెళ్లి పెళ్లి చేసుకోబోతున్నాడంట.ఇంట్లో వాళ్ళు అమ్మాయిని కూడా చూశారట. అతను చుట్టాలమ్మాయినే ఆది పెళ్లి చేసుకుంటున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయం గురించి జబర్దస్త్ యాజమాన్యానికి ఆది చెప్పాడంట.అలాగే ఈ విషయం గురించి గోప్యంగా ఉంచమని కూడా చెప్పాడంట.అందుకే ఈ వార్త ఎక్కడ బయటపడలేదు.పెళ్లి చేసుకున్నాకా మళ్ళి జబర్దస్త్ కు వస్తా అని ఆది చెప్పాడంట.మరి ఆయన పెళ్లి చేసుకునేది ఎప్పుడో ఆది స్కిట్స్ మళ్ళి మనం చూసేదెప్పుడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హైపర్ ఆది గురించి అలాగే అతను జబర్దస్త్ మానేయడానికి అతని పెళ్ళియె కారణం అని వస్తున్న వార్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.