జబర్దస్త్ కు రాకముందు హైపర్ ఆది జీవితం

1012

హైపర్ ఆది.. జబర్దస్త్ చూసే ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్’ కామెడీ షోలో అతి తక్కువ కాలంలో బాగా పాపులరైన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ పంచులు, టైమింగ్ డైలాగులతో ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అతడు ఎంటరయ్యాక మిగతా టీమ్స్ రేటింగ్స్ పరంగా వెనకపబడిపోయారనే వాదన కూడా ఉంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆది పేరు చెబితే యూ ట్యూబ్ వ్యూస్ లక్షల్లో వస్తాయి. మిలియన్స్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఈయన స్కిట్ ఒక్కటి అప్ లోడ్ చేస్తే కనీసం 50 లక్షల మంది చూస్తున్నారు. అంత పాపులర్ అయిపోయాడు హైపర్ ఆది. అయితే ఆది జబర్దస్త్ కు రాకముందు ఏం చేసేవాడు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for hyper adi

హైపర్ ఆది ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలో జన్మించాడు..వీళ్లది చిన్న వ్యవసాయ కుటుంబం. కందుకూరులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో 2012లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. రెండేళ్లు ఐటీ ఎంప్లాయిగా జాబ్ చేసాడు ఈయన. అప్పట్లోనే తనకు 5 లక్షలు ప్యాకేజ్ వచ్చేది. అయినా కూడా అసంతృప్తితో ఉండటంతో అన్ని లక్షలు కూడా వదిలేసుకుని నచ్చిన ఫీల్డులోకి వెళ్లాలనుకున్నాడు. ఉద్యోగం మానేసిన తర్వాత రెండు మూడు షార్ట్ ఫిలింస్ స్నేహితులతో కలిసి చేసాడు. ఒకసారి అత్తారింటి దారేది సినిమాను పేరడీ చేసి బావింటి దారేది అనే పేరడీ చేశాడు. కామెడీ పంచులు వేస్తూ మంచి ఫ్లోలో చేశాడు. దానిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దానిని అదిరే అభి చూసి కింద కామెంట్ చేశాడంట. చాలా బాగుంది ఒకసారి వచ్చి కలవు అని అన్నాడంట. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి మీట్ అవ్వమని అన్నాడంట. అలా అదిరే అభితో పరిచయం అయ్యింది. అలా అదిరే అభి జబర్దస్త్ లో ఛాన్స్ ఇచ్చాడు.

ఈ క్రింద వీడియో చూడండి

కొన్ని రోజులు జబర్దస్త్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన ఆది తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. కొత్త టీమ్స్ ను తీసుకురావాలని జబర్దస్త్ యాజమాన్యం అనుకుంది. అందులో భాగంగా టీమ్ లీడర్ గా చేస్తావా అని ఆదికి ఆఫర్ వచ్చింది. అప్పుడే హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ కు లీడర్ అయ్యాడు. అలా రాజుతో కలిసి దూసుకుపోయాడు. 2016లో ఈ షోలోకి వచ్చిన ఈయన ఇప్పటి వరకు దాదాపు 100 స్కిట్లు చేసాడు. నవ్వించడంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ ఉండదంటున్నాడు ఈయన. మనలో టాలెంట్ ఉంటే ఎలా అయినా బతికేయొచ్చని కష్టపడే తత్త్వం ఉన్నపుడు ఏ రంగంలో ఉన్నా కూడా విజయం వెతుక్కుంటూ వస్తుందని చెబుతున్నాడు హైపర్ ఆది. వ్యవసాయ కుటుంబంలో పుట్టినా తాను ఇప్పుడు ఇక్కడ ఉండటం నిజంగా గర్వంగా ఉందంటున్నాడు. మొత్తానికి తాను సాఫ్ట్ వేర్ నుంచి వచ్చి ఇక్కడ తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నానని చెబుతున్నాడు ఈ జబర్దస్త్ కుర్ర కమెడియన్. ఆది లైఫ్ ఇలాగే కొనసాగి మరింతకాలం మన అందరిని నవ్వించాలని కోరుకుందాం.