Breaking News: హీరో తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత షాక్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్

212

నంద‌మూరీ హీరోల్లో తార‌క‌ర‌త్న కూడా ఒక‌రు, ఆయ‌న చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయినా ఆయ‌న‌కు కూడా నంద‌మూరి అభిమాన ఘ‌నం మెండుగా ఉంది. ఇక ఇటీవ‌ల ఆయ‌న సోద‌రీమ‌ణి సుహాసిని కూక‌ట్ ప‌ల్లి నుంచి తెలుగుదేశం త‌ర‌పున పోటీ చేశారు అక్క‌డ కూడా ఆయ‌న ప్ర‌చారం చేశారు ఇలా నంద‌మూరి కుటుంబంలో ఆయ‌న పేరు ఎక్కువ‌గా వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయ‌న గురించి ఓ వార్త ఇప్పుడు
చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సినీ హీరో తారకరత్నకు సంబంధించిన డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎందుకు కూలుస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్‌లోని సామాగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

hyderabad: ghmc staff to demolish hero nandamuri taraka ratna restaurant
డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వారి ఫిర్యాదుతోనే రెస్టారెంట్‌ను కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు అయితే ఇది నిబంధ‌న‌ల‌కు విరుద్దం కావ‌డంతో ఇక ఆయ‌న కూడా చేసేది లేక అక్క‌డ నుంచి రెస్టారెంట్ సామాన్లు త‌ర‌లిస్తున్నారు.