మళ్ళి పెళ్లి చేసుకుంటున్న హృతిక్ రోషన్..వదువు ఎవరో కాదు…

557

బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే. విడిపోవడాలు కూడా ఎక్కువే. రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనకున్న బంధాల గురించి అర్థం కాదు.సెలెబ్రిటీల బ్రేక్ అప్ లు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్ వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ 2014 లో విడాకులు పొంది విడిపోయారు. అప్పట్లో ఈ విషయంలో హాట్ టాపిక్ గా మారింది.హృతిక్ రోషన్, సుషాన్నే ఖాన్ 2000లో వివాహ బందం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.కంగనా రనౌత్ విషయం ద్వారా విభేదాలు తలెత్తడంతో హృతిక్, సుషాన్నే 2014 లో విడిపోయి వేరువేరుగా జీవితం గడుపుతున్నారు. స్నేహితులుగా కలిసి ఉంటున్నారు.

అయితే ఇప్పుడు మళ్ళి పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని అనుకుంటున్నారు. సుసానే ఖాన్‌ను హృతిక్‌ రోషన్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారట. ఈ కపుల్‌ మళ్లీ చేసుకోబోతున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ విషయాన్నీ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.మరి ఇది నిజమో కాదో తెలియలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.