హరికృష్ణకు కారు ప్రమాదం ఎలా జరిగింది.. నమ్మలేని నిజాలు

472

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం.అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా..చెబుతా వినండి.

Image result for harikrishna nandamuri

ప్రకాష్ శివాజీ మరియు రావు లతో కలిసి ఒంగోల్ వెళ్ళడానికి సిద్దమయ్యాడు.అక్కడ ఒక పెళ్లి ఉంటె ఆ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి అని వెళ్తున్నారు.అక్కడికి వెళ్తున్న సమయంలోనే హరికృష్ణకు కారు ప్రమాదం జరిగి మృతి చెందాడు.హరికృష్ణకు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం అతివేగం అని తెలుస్తుంది.అయితే, ప్రమాద స్థలంలో రెండు వాహనాలు ఉన్నాయి. హరికృష్ణ రోడ్డుపై పడిపోవడంతో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి పల్టీ కొట్టిందా..? లేక ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిందా..? వేరే వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా ఢీకొట్టిందా..? అసలు ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా..? లేదా..? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రమాదం చూస్తుంటే ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది.అలాగే ప్రమాదం జరిగిన స్థలాన్ని చూస్తే ఆయన కారు పల్టీ కట్టినట్టు స్పష్టంగ కనిపిస్తుంది.అతివేగంగా వెళ్తున్న కారుకు ఏదో ఒకటి అడ్డు వచ్చింటది.

Image result for harikrishna nandamuri

అందుకే ఆయన సడెన్ బ్రేక్ వేసి ఉంటాడు.అందుకే కారు పల్టీ కట్టి ఉంటదని సంఘటన స్థలాన్ని చుసిన ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థం అవుతుంది.అయితే ఆయన ప్రయాణిస్తున్న కారులో ఆయనొక్కడే ఉండడం వలన ఆయన ఒక్కరే చనిపోయారు.ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు.ఇప్పటివరకు ఉన్నవి అనుమానాలు మాత్రమే.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.ఈ విషయం తెలిసిన నందమూరి కుటుంబం కూడా తట్టుకోలేకపోతున్నారు. అందరు కలిసి మాసాబ్ ట్యాంక్ లో ఉన్న హరికృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నారు.మనం కూడా కామెంట్ రూపంలో ఆయన మృతికి నివాళి అర్పిద్దాం.మరి ఈయన మరణం గురించి అలాగే నందమూరి వంశస్తులు ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ లో చనిపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.