క్యాన్సర్ చిన్నారికి బాలయ్య బాబు ఫోన్ ఎంత సాయం చేశారో తెలిస్తే షాక్

144

బాలయ్య బాబు నటన అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. బాలయ్య సినిమాలు అంటే అభిమానించే వారు చాలా మంది ఉంటారు, తొడగొట్టినా మీసం మెలేసినా బాలయ్య బాబు లెక్క వేరుగా ఉంటుంది, ఆయన అభిమానులకు బాలయ్య బాబు సినిమా వచ్చింది అంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది.మా బాలయ్య బంగారం, మనసున్న మారాజు, బంగారు బుల్లోడు, దేవుడు, దైవం మనిషి రూపేనా. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, నందమూరి అభిమానులు. సాధారణంగా ట్విట్టర్ ఓపెన్ చేస్తే నందమూరి బాలకృష్ణ మీద ఎక్కువగా ట్రోలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ, ఇప్పుడు బాలయ్యను పొగుడుతూ, ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్లు కనిపిస్తున్నాయి. దీనికి బలమైన కారణమే ఉంది. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఒక బాలికకు బాలకృష్ణ సాయం అందిస్తున్నారు. తాను మేనిజింగ్ ట్రస్టీ, చైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఆ బాలికకు ఉచితంగా చికిత్స అందించడానికి పూనుకున్నారు.

Image result for క్యాన్సర్ చిన్నారికి బాలయ్య బాబు

అనంతపురం నగరంలోని సోమనాథనగర్‌లో నివాసముంటున్న వెంకట్రాముడు, అరుణ దంపతుల కుమార్తె స్వప్న బోన్ క్యానర్స్‌తో బాధపడుతోంది. వెంకట్రాముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కుమార్తెకు మెరుగైన చికిత్స అందించలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక, కుమార్తెను ఆ పరిస్థితిలో చూడలేక ఈ దంపతులు కుమిలిపోతున్నారు. అయితే, స్వప్న ధీనగాథపై ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ విషయాన్ని కొంత మంది అధికారులు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు.

Image result for క్యాన్సర్ చిన్నారికి బాలయ్య బాబు

వెంటనే బాలయ్య.. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌస్‌మొయిద్దీన్, ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామిలను స్వప్న ఇంటికి పంపారు. బాలికతో, ఆమె తల్లి అరుణతో బాలకృష్ణ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. స్వప్నకు బసవతారకం హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి రావాలని, ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని గౌస్‌మొయిద్దీన్‌కు ఫోన్‌లో బాలయ్య సూచించారు.

ఈ క్రింద వీడియో చూడండి

బాలయ్య మాత్రమే కాకుండా అనంతపురం జిల్లాలోని దాతలు కూడా స్పందించారు. కొంత మంది స్వప్న వద్దకు నేరుగా వచ్చి విరాళాలు అందజేయగా.. మరికొందరు ఆపరేషన్‌కు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దాతలు ఇచ్చిన మొత్తం రూ.3 లక్షల వరకు ఉంది. ఈ విషయాలు ఎలా ఉన్నా.. క్యానర్స్‌తో బాధపడుతోన్న స్వప్న గురించి తెలిసిన వెంటనే స్పందించడమే కాకుండా ఆపరేషన్‌కు కూడా ఏర్పాట్లు చేస్తోన్న బాలయ్య బాబును చూసి అభిమానులు పొంగిపోతున్నారు. బంగారం మా బాలయ్య అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన పని వైరల్‌గా మారింది. మరి బాలయ్య బాబు చేస్తున్న సాయం పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

ఈ క్రింద వీడియో చూడండి