ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి పాత్ర చేస్తుంది ఎవరో చూడండి

392

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related image

ఈ చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా పురంధరేశ్వరి పాత్రకు సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయవాడకు చెందిన హిమాన్సి చౌదరి అనే డ్యాన్సర్‌ పురంధరేశ్వరి పాత్రలో కనిపించబోతోందని టాక్.

Himaansi to play NTR’s daughter role in Purandeswari in NTR’s biopic

పురంధరేశ్వరి, హిమన్సీ కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం చిన్నమ్మ పాత్రకు హిమన్సీ పర్ఫెక్టుగా సరిపోతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే చిత్ర యూనిట్ దీని మీద ఇంకా స్పందించలేదు.