హీరోల్లో అత్యంత సంపాదన పరుడు అతడే..ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా..

472

సినిమా హీరోలు అన్నాకా సంపాదన బాగానే ఉంటుంది.ఒక్కొక్కరు కొట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు.అయితే ఈ ప్రపంచంలో అత్యంత సంపన్న పరుడైన హీరో ఎవరో తెలుసా..ప్రపంచంలోనే అత్యంత సంపాదనపరుడైన నటుడిగా నిలిచాడు హాలీవుడ్ హీరో డ్వయన్ జాన్సన్. ‘ది రాక్’గా ప్రఖ్యాతి పొందిన ఇతడు అనేక పాపులర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవాడే.

గత ఏడాదికి గానూ అత్యంత పారితోషికం పొందిన నటుల్లో డ్వయన్ తొలి స్థానంలో ఉన్నాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది.అత్యంత సంపాదన పరులైన వంద మంది వినోదరంగ ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అందులో ‘ది రాక్’ నంబర్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు.గత ఏడాదిలో ఇతడు ఏకంగా 124 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పారితోషికంగా పొందాడని ఫోర్బ్స్ పేర్కొంది.

భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే ఇది 850 కోట్ల రూపాయల మొత్తానికి సమానం.గత ఏడాదిలో ఈ నటుడు 65 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని పొందడాని, ఈ సారి ఇతడి సంపాదన రెట్టింపు అయ్యిందని కూడా ఫోర్బ్స్ పేర్కొంది.