కొంప ముంచిన వాటర్ బాటిల్, హరికృష్ణ అసలు ప్రమాదానికి కారణాలివే

736

అతివేగం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణమరణించడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సమయంలో గంటకు 160 కి.మీ. వేగంతో హరికృష్ణ వాహనం నడిపారని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నెల్లూరు జిల్లాకు వెళ్తున్న ఆయన ఉదయం 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరారని ఎస్పీ చెప్పారు.నార్కెట్‌పల్లి దగ్గర చిట్యాల దాటిన తర్వాత గుంటూరు హైవే మీద వెళ్తుండగా.. 12వ బెటాలియన్ గ్రౌండ్స్ వద్ద ఆయన వాహనంపై నియంత్రణ కోల్పోయారని ఎస్పీ తెలిపారు. దీంతో వాహనం డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం, తర్వాత ఎదురుగా వస్తోన్న మరో కారును ఢీకొట్టిందన్నారు.

Image result for harikrishna nandamuri

వాహనం 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుండటం, వర్షం కారణంగా రోడ్డు జారుడుగా ఉండటం ప్రమాదానికి కారణమైందన్నారు. ఈ ప్రమాదం విషయమై నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జి కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అన్నెపర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగిందనే సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరకున్నానని ఆయన తెలిపారు. రోడ్డు పక్కన పడిపోయి హరికృష్ణ వెంటనే చనిపోయారని భూపాల్ రెడ్డి తెలిపారు.డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అదే సమయంలో మలుపు వద్ద వాహనం ఎడమ వైపు తిరుగుతుందని భావించిన ఆయన స్టీరింగ్‌ను కుడి వైపు తిప్పారు. దీంతో వాహనం మూడు పల్టీలు కొట్టింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం… వాహనం డోర్ తెరుచుకోవడంతో.. ఆయన రోడ్డు పక్కనున్న కంకర రాళ్ల మీద పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రాణాలు కోల్పోయారు. సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవ’ని భూపాల్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని ఛాయా సోమేశ్వరాలయాన్ని హరికృష్ణ తప్పకుండా దర్శించుకునేవారని గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన భూపాల్ రెడ్డి తెలిపారు.