ఎంత డబ్బు ఇస్తా అన్న దానికి ఒప్పుకోలేదు… హీరోయిన్ శ్రియ

402

టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగిన నటి శ్రియ. ఆమెతో నటించని హీరో లేడు. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఆమె కోసం పడిచచ్చిపోయే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇటీవలే పెళ్లి చేసుకుని సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసింది. ఐతే ఎప్పుడు ఏ వివాదంలో ఉందని శ్రియ ఇప్పుడు ఒక విషయం మీద కామెంట్స్ చేసింది. ఒక కంపెనీ ప్రోడక్ట్ మీద శ్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి శ్రియ ఏమన్నదో చూద్దామా.

Image result for shriya

ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తాను ఆది నుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలకు వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆ మధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని తెలిపింది. తొలుత ఆ కమర్షియల్ యాడ్ లో నటించాలని తననే సంప్రదించారని, దాన్ని తాను తిరస్కరించానని చెప్పింది.”సదరు క్రీమ్ వాడితేనే అమ్మాయిలకు పెళ్ళవుతుందా? లేకపోతే కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబంధించిన విషయం. అది స్వతహాగానే వస్తుంది తప్ప ఏ క్రీమ్ లు వాడినా రాదు. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా నేను ఒప్పుకోను” అని ఆమె వ్యాఖ్యానించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే హీరోయిన్‌ గా రాణించక ముందు కొన్ని సౌందర్య ఉత్పత్తులకు యాడ్స్ చేశారు కదా? అని ప్రశ్నలు అడిగేవాళ్లకు తాను ఒక్కటే సమాధానం చెబుతానని, ఆ సమయంలో తన వయస్సు చాలా తక్కువని, పరిపక్వత లేని సమయంలో ఆ యాడ్స్ చేశానని అంది. ఇప్పుడైతే అటువంటి యాడ్స్ ఒప్పుకోబోనని చెప్పింది. కాగా, తన తర్వాత ఎంతోమంది హీరోయిన్లు వచ్చినా.. అవకాశాలు ఏమాత్రం కోల్పోకుండా తాను మాత్రం ఏదో చిత్రంలోనో, స్పెషల్ సాంగ్ లోనే తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్న శ్రియా, యాడ్స్ విషయంలో మాత్రం ప్రస్తుతం ఆంక్షలు పెడుతోందట!ఇదండీ సంగతి. మరి శ్రియ గురించి యాడ్స్ విషయంలో శ్రియ చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.