హీరోయిన్ కళ్యాణి ఇప్పుడు ఎంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

1348

హీరోయిన్ కళ్యాణి గురించి మన అందరికి తెలిసిందే. శేషు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉండే ఈ కేరళ భామ చేసిన తెలుగు సినిమాలు తక్కువైనా ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది. ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవలం ట్రెడిషనల్ లుక్ తోనే ఎంతో మందిని ఆకట్టుకుంది.చాలా మంది స్టార్ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది.అయితే ఇంత వెలుగువెలిగిన కళ్యాణి ఇప్పుడు ఎంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తుందో తెలుసా..ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for heroine kalyani

కళ్యాణి అసలు పేరు కావేరి. బాలనటిగా మలయాళంలో స్టార్ హీరోలందరికీ కూతురిగా నటించింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు సినిమా ద్వారా టాలీవుడ్ కి వచ్చింది. ఆ తరవాత అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. వసంతం,దొంగోడు,పెదబాబు వంటి హిట్ సినిమాల్లో నటించింది.కళ్యాణి టాలీవుడ్ కి రాకముందే తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సత్యం,ధన 51 సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సూర్య కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కళ్యాణి. ఇద్దరూ మలయాళీలే కావటంతో వీరి పెళ్ళికి అభ్యంతరాలు లేవు. అయితే పెళ్లి తర్వాత సూర్య కిరణ్ కి ఒక హిట్ కూడా రాకపోవటంతో ఆ చిరాకు,అసహనం భార్యపై చూపేవాడట. ఇక కళ్యాణి భర్తను డైరెక్టర్ గా నిలబెట్టటానికి ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి కొన్ని సినిమాలను నిర్మించింది.ఆ సినిమాలు కూడా హిట్ కాకపోవటంతో సూర్య కిరణ్ తాగి వచ్చి కళ్యాణిని ఇబ్బంది పెట్టేవాడట.

Image result for heroine kalyani
భర్త కారణంగా ఆర్ధికంగాను,కుటుంబ పరంగాను ఎన్నో ఇబ్బందులను పడిన కళ్యాణి తన సొంత ఊరు వెళ్లిపోయిందట.అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరితో పెద్దగా సంబంధాలు మైంటైన్ చెయ్యలేదు. ఇక కళ్యాణి ఎక్కడ ఉందొ కూడా తెలియకుండా పూర్తీగా అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఒకరోజు ఒక ఆంధ్ర కుటుంబం వైద్యం నిమిత్తం కేరళ వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన ఒక మహిళ కళ్యాణిలాగా అనిపించి దగ్గరకెళ్ళి చూస్తే కళ్యాణి వాళ్లకు దీన స్థితిలో కనిపించింది.ఒక వ్యాధితో భాదపడుతూ ఆమె వైద్యం కోసం ఆ కేరళ హాస్పిటల్ లో ఉన్నట్టు తెలిసింది.పూర్తీగా రూపురేఖలు చేరిగిపోయి చాలా దారుణమైన స్థితిలో కనిపించిన కల్యాణిని చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగలేదంట.అంత మంచి సినిమాలు చేసిన నటి ఇంత దుర్భర జీవితాన్ని అనుభవించడం చూసి షాక్ అయ్యారంట.ఆస్తులన్నీ పోవడమే కాకుండా రోజువారీ ఖర్చుల కోసం కూడా డబ్బులు లేని స్థితిలో ఆమె కనిపించిందట.దాంతో చలించిపోయిన వారు కొంత ఆర్థిక సహాయం చెయ్యడమే కాకుండా మదర్ తెరిస్సా ఫౌండేషన్ వాళ్లకు ఫోన్ చేసి ఆమెకు అక్కడ చేర్పించే ఏర్పాట్లు చేశారంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతే దారుణమైన ఆమె పరిస్థితిని కేరళ మీడియాలో ప్రచురించడమే కాకుండా హీరోయిన్స్ పరిస్థితి గురించి ఒక ఆర్టికల్ రాసి ఈమె ఫోటోను కూడా ముద్రించారంట.ఆ తర్వాత ఆమె మళ్ళి నటించాలనుకుంది. జగపతి బాబు,కళ్యాణిది హిట్ ఫెయిర్. దాంతో ఆ పరిచయాన్ని ఉపయోగించుకొని బ్రహ్మాస్త్రం సినిమాకి ఛాన్స్ ఇప్పించిన అది కూడా నిరాశ పరచింది.మరల హైదరాబాద్ వచ్చి విన్నర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి. ఏ అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోవటానికి కళ్యాణి సిద్ధంగా ఉంది. కళ్యాణికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం.మరి కళ్యాణి గురించి ఆమె అనుభవిస్తున్న దుర్భర జీవితం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.