హీరోయిన్ హన్సిక మీద కేసు నమోదు, కారణం ఏంటో తెలిస్తే షాక్.

359

సినిమా నటినటుల మీద కేసులు నమోదు కావడం సహజం. వారు తప్పు చెయ్యకపోయినా కొన్నిసార్లు అనేక కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని సినిమాల విషయంలో వారు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పట్లో ఒక సినిమా విషయంలో మంచు మోహన్ బాబు మీద కేసు వేశారు అలాగే తన మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని చాలా సినిమాల విషయంలో కేసుల్లో ఇరుకున్న నటీనటులు డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి హీరోయిన్ హన్సికకు కూడా వచ్చింది.మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for hansika

హీరోయిన్ హన్సిక మీద తమిళనాడులో కేసు నమోదైంది. హన్సిక నటిస్తున్న కోలీవుడ్ మూవీ ‘మహా’ పోస్టర్ వివాదాస్పదంగా ఉండటమే అందుకు కారణం. దీంతో పిఎంకె లీడర్ జానకి రామన్ హన్సికతో పాటు దర్శకుడు జమీల్ మీద కోర్టులో కేసు వేశారు. ‘మహా’ మూవీలో రుద్రాక్షమాల ధరించిన హన్సిక పొగ త్రాగుతున్నట్లు చూపించడంపై జానకిరామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని ఆయన ఆరోపించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తన పిటీషన్లో కోరారు.వివాదానికి కారణమైన హన్సిక పోస్టర్ ఇదే. అయితే చిత్ర బందం మాత్రం అఘోరాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ పోస్టర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసుపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హన్సిక కెరీర్లో ‘మహా’ 50వ చిత్రం. యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హ‌న్సిక డిఫ‌రెంట్ షేడ్స్‌లో వెరైటీ లుక్‌లో క‌నిపించనుంది. గ‌తంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర‌లో హ‌న్సిక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 50 సినిమాల మైలురాయి చేరుకున్నందుకు సంతోషపడాలో కేసులో ఇరుకున్నందుకు బాధ పడాలో అని హన్సిక మదనపడుతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హీరోయిన్ హన్సిక గురించి అలాగే మహా సినిమా పోస్టర్ గురించి ఆమె మీద కేసు వెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.