కొర‌టాల సినిమాలో మెగా స్టార్ కు హీరోయిన్ ఫిక్స్

362

ఆయ‌న ర‌చయిత‌గా సినీ ప్ర‌స్ధానం మొద‌లుపెట్టారు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ద‌ర్శ‌కుడిగా ఎదిగారు.. అతి కొద్దిమంది అగ్ర‌ద‌ర్శ‌కుల జాబితాలో ఆయ‌న కూడాస్దానం సంపాదించుకున్నారు.. ఆయ‌నే కొర‌టాల శివ‌.. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

Image result for anushka

ఇప్ప‌టికే సినిమా కథ‌పై మొత్తం వ‌ర్క్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు కొర‌టాల శివ‌.. అలాగే తాజాగా ఈసినిమాలో క్రూ వేట‌లో కూడా చిత్ర‌యూనిట్ ఉంది.. ఇటు సైరా షూటింగ్ తో చిరు బిజీగా ఉండ‌టంతో, ఆయ‌న‌కు విష‌యం చెబుతూ క‌థ వ‌ర్క్ చేస్తున్నారు కొర‌టాల‌.. ఇప్ప‌టికే ఆయ‌న సినిమాలో న‌టీన‌టుల ఎవ‌రు ఉండాలి అనేదానిపై ఫిల్మ్ ఫ్రింట్ తీసుకున్నారు అని తెలుస్తోంది.

Image result for anushka

మెగాస్టార్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఒకే అంటారు… హీరోయిన్ల‌లో ఇప్పుడు చిరంజీవి ప‌క్క‌న ఎవ‌రు అయితే బాగుంటారు అనే ఆలోచ‌న కొర‌టాల‌కు వ‌చ్చింది.. దీంతో ఆయ‌న చిరు ప‌క్క‌న హీరోయిన్ గా అనుష్క శెట్టిని తీసుకున్నారు అని తెలుస్తోంది… ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుప‌గా ఆమె న‌టించేందుకు కూడా ఒకే చెప్పార‌ట‌… ఈ సినిమా డిసెంబ‌ర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే ఏ విష‌య‌మైనా తెలుస్తుంది.