ఒకప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ ఇప్పుడు వేల కోట్లరూపాయల ఆస్తిపరురాలు ఎలా అంటే

1521

రంగుల ప్రపంచం సినీ రంగంలో ఎప్పుడు ఎవరు ఎలా మారతారో తెలియ‌దు, అసలు ఈ ఇండస్ట్రీకి ఎలా వస్తారో,వచ్చాక జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. అవ‌కాశాలు ఉన్నంత సేపు వారికి తిరుగు ఉండ‌దు. ఒక‌సారి అవ‌కాశాలు త‌గ్గితే వారిని ప‌ట్టించుకునే వారు ఉండరు. అందుకే ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి అవ‌కాశాలు వ‌చ్చి ఎలాంటి పేరు తెచ్చుకుంటారో ఊహించ‌లేము. విల‌న్లుగా వ‌చ్చి హీరోలు అయిన వారు కొంద‌రు .ఇక క‌మెడియ‌న్లు గా వ‌చ్చి హీరోలు అయిన వారు కొంద‌రు. అయితే చిన్న చిన్న సినిమాల‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోల‌తో న‌టించిన హీరోయిన్లు కొంద‌రు.

Image result for actress madhavi

ఇప్పుడు ఇలాంటి ఓ న‌టి గురించే చెప్పుకోవాలి. ఆమె న‌ట‌న‌తో తెలుగు చ‌ల‌న చిత్రాల్లో త‌న ముద్ర వేసింది. చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోల ప‌క్క‌న ఆమె న‌టించి మంచి హిట్ సినిమాలు సాధించింది. ఆమే హీరోయిన్ మాధ‌వి. ఆమె అచ్చమైన తెలుగు న‌టి. తెలుగు సినిమాల్లో చిరంజీవి మాధ‌వి హిట్ పెయిర్ గా మంచి విజ‌యాలు సాధించారు. వారు ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమా్లో ఖైదీ సినిమా వారికి పెద్ద హిట్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి. త‌ర్వాత చ‌ట్టానికి కళ్లు లేవు, కోత‌ల‌రాయుడు, దొంగ‌మొడుగు, ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య హిట్ సినిమాలు. అలాగే ఆమె క‌న్న‌డ‌లో రాజ్ కుమార్ విష్ణువ‌ర్ద‌న్, మ‌ళ‌యాలంలో మ‌మ్ముట్టితో కూడా న‌టించారు.. ఇక మాతృదేవోభ‌వ‌లో ఆమె న‌ట‌న‌తో అంద‌రికి ఏడుపు వ‌స్తుంది. ఆ సినిమా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఇక మాధ‌వి గురించి తెలుసుకుంటే?

Image result for actress madhavi

మాధవి 1965 సెప్టెంబర్ 4న హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి గోవిందస్వామి,తల్లి శశిరేఖ. ఈమెకు ఒక అక్క,అన్న కూడా ఉన్నారు. భరతనాట్యం చిన్నప్పటి నుంచి నేర్చుకుని, 8ఏళ్ళ వయస్సు నుంచి ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది ఆమె, దాదాపు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఓరోజు ఆమె అబిడ్స్ స్కూల్ లో 8వ తరగతి చదువుతుండగా భ‌ర‌త‌నాట్యం ప్రద‌ర్శ‌న చూశారు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. చూడడంతో సినిమా లో నటించాలని కోరారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలా 13ఏళ్ళ వయస్సులోనే తూర్పు పడమర సినిమాతో ఆరంగేట్రం చేసిన మాధవికి, ఆసినిమా ఊహించని విజయాన్ని అందించింది. ఇక వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ఆత‌ర్వాత‌ తెలుగుతో పాటు , తమిళ, కన్నడ,హిందీ ,మలయాళం,ఒరియా భాషల్లో నటించింది. మాధవి 17ఏళ్లపాటు సాగించిన సినీ జీవితంలో 300కి పైగా చిత్రాల్లో నటించింది. ఇక 1985 -90మధ్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. సినిమాల్లో మంచి జోష్ లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ శర్మను మాధవి వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అయితే రామ్ శ‌ర్మ‌ను ఆమె వివాహం చేసుకోవ‌డానికి కార‌ణం, మాధవి ఆధ్యాత్మిక గురువు రామస్వామి శిష్యురాలు కావటంతో అయన సలహాతో ఆయన శిష్యుడైన జర్మన్ మూలాలున్న భారతీయుడు అయిన రాజ్ శర్మను వివాహం చేసుకొన్నారు.