రామ్ సరసన హాట్ హీరోయిన్ ను సెట్ చేసిన పూరి?

181

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది.

Image result for ismart shankar

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించిన వార్త ఆసక్తిని రేపింది. అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారట. మజ్ను సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయినా ఈ భామ ఆ తర్వాత అజ్ఞాతవాసి శైలజారెడ్డి అల్లుడులో నటించింది.

Image result for ram anu emmanuel

అయితే ఈ విషయం మీద పూరి జగన్నాథ్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పూరి చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ బ్రహ్మండమైన సక్సెస్ అందుకుంటోదో వేచి చూడాల్సిందే.