హీరోయిన్ ఆమని నటవారసురాలు వచ్చేస్తుంది..త్వరలో రంగప్రవేశం..

695

సినిమా రంగంలో ఛాన్సులు రావాలంటే టాలెంటుతో పాటు వారసత్వం కూడా అవసరం. వారసత్వం ఉంటె అవకాశాలు ఎక్కువ వస్తాయి.ఇప్పటికే ఎందరో వారసత్వం పేరుతో వచ్చారు.. ఇదే తరహాలో త్వరలో మరో బ్యూటీ వెండి తెరకు పరిచయం కాబోతోంది. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రస్తుతం తల్లి పాత్రల్లో అలరిస్తున్న ఆమని కుటుంబం నుంచి ఓ అందమైన అమ్మాయి నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఆమని మేనకోడలు

ఆమని మేన కోడలు హృతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.. అయితే ఈ అమ్మడు తెరంగ్రేటం చేస్తుంది తెలుగు సినిమా ద్వారా కాదు… ఓ తమిళ చిత్రం ద్వారా ఆమె తెరంగ్రేటం చేయబోతున్నారు.మురుగన్‌ దర్శకత్వంలో ‘విడియాద ఇరవొండ్రు వేండుం’ అనే చిత్రం ద్వారా హృతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

సినిమాలపై ఇష్టంతోనే...

మా అత్తయ్య ఆమని తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మా మామయ్య ఖాజామొయిద్దీన్‌ సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. వారి ఆశీస్సులతో నేను సినిమాల్లోకి వచ్చాను.ఈ రంగంలోకి రావడానికి ఆమెనే నాకు రోల్ మోడల్. నటనపై ఆసక్తి ఎక్కువ. భరతనాట్యంతో పాటు వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్చుకున్నట్లు హృతిక తెలిపారు.చూడాలి మరి ఈమె కెరీర్ ఎలా ఉంటుందో.