హీరో యష్ అభిమాని కన్నుమూత వెంట‌నే య‌ష్ ఏం చేశాడో తెలిస్తే షాక్

302

సినిమా హీరోల‌పై, హీరోయిన్ల‌పై అభిమానం హ‌ద్దులు దాటితే దానిని త‌ట్టుకోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు అని చెప్పాలి.. తమ అభిమాన హీరోని ఒక్కసారి చూసి అతనితో సెల్ఫీ తీయించుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది. కానీ కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల స్టార్ హీరోలు పబ్లిక్ గా బయలకు రాలేరు. ఎప్పుడో ఒకసారి వచ్చినా..దూరంగా హాయ్ చెప్పి కాస్త వెసులు బాటు దొరికితే సెల్పీలు తీయించుకుంటారు. సాధారణంగా తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారన్న విషయం పలుమార్లు రుజువైంది. తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా అతని హార్డ్ కోర్ ఫ్యాన్ రవి శుభాకాంక్షలు తెలపడం కోసం వెళ్లాడు. కానీ అత‌నిని సెక్యూరిటీ సిబ్బంది అనుమ‌తించ‌లేదు.

తాను ఎంతో దూరం నుంచి వచ్చానని..తన అభిమాన హీరోని కలవనివ్వండని అతడు ఎంతగానో ప్రాధేయ పడ్డాడు..కానీ అక్కడి సెక్యూరిటీ గార్డులు ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అక్కడే అందరూ చూస్తుండగానే..పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. 75 శాతం కాలిన గాయాల‌తో ఉన్న ర‌విని బెంగ‌ళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. విష‌యం తెలుసుకున్న య‌ష్ ర‌వికి సంతాపాన్ని తెలియ‌జేస్తూ, కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా, ప్రతి సంవత్సరం యష్ తన పుట్టిన రోజు వేడుకలు ఇంటి వద్దే ఘనంగా చేసుకుంటారు. ఆ సమయంలో పలువురు ఫ్యాన్స్ ని కలిసి మాట్లాడి సంతోష పరుస్తుంటారు. ఈ సంవత్సరం ప్రముఖ నటుడు అంబరీష్ మరణించిన కారణంగా యష్ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదు. ఈ విషయాన్ని తన ఫ్యాన్స్ కి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ప్రతి సంవత్సరం యష్ ని చూసేందుకు రవి వస్తుంటారు..కలిసి వెళ్తుంటారు. కానీ ఈ సంవత్సరం సెక్యూరిటీ అడ్డుకోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన అత‌ను ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని అంటున్నారు.ఆయ‌న కుటుంబాన్ని ఆదుకుంటాము అని చెబుతున్నారు య‌ష్ అభిమానులు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో కాస్త ఆచితూచి ఆలోచించాలి అని హీరోలు చెబుతున్నారు. ఆలోచించ‌కుండా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే మీ కుటుంబం ఒంట‌రి అవుతుంది అని చెబుతున్నారు పెద్ద‌లు.