హీరో విశాల్ పెళ్లి.. అమ్మాయి ఎవరో చూస్తే తప్పకుండా షాకవుతారు

489

దక్షిణ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో విశాల్ ఒకడు. తెలుగులో ప్ర‌భాస్ రానా పేర్లు ఎలా వినిపిస్తాయో విశాల్ పేరు అక్క‌డ వినిపిస్తుంది.. 40 ఏళ్లు దాటినా ఇంకా ఒంటరిగానే జీవిస్తున్న విశాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సల్మాన్‌ఖాన్, ప్రభాస్‌లా విశాల్ పెళ్లి కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే. వరలక్ష్మి శరత్‌కుమార్‌తో చాలాకాలం పాటు సన్నిహితంగా ఉన్న విశాల్ తనకు ఆమె స్నేహితురాలు మాత్రమేనని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఇటీవల స్పష్టం చేశాడు. ఇక ఆమెకూడా ఇటీవ‌ల ఇదే విష‌యం తెలియ‌చేశారు, మంచి అమ్మాయిని చూసి విశాల్ కు పెళ్లి చేయాలి అని కూడా అంది.

Image result for vishal

ఇక నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్.. ఈ సంఘానికి భవనం పూర్తిచేశాకే పెళ్లి చేసుకుంటానని గతంలో శపథం చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విశాల్ పెళ్లి మళ్లీ చర్చనీయాంశమైంది. ఇక ఆయ‌న పెళ్లి చేసుకుంటారు అని ఆయ‌న అభిమానులు రెండు నెల‌లుగా చూస్తున్నారు ఆ ప్ర‌క‌ట‌న వ‌స్తుంది అని ఎదురుచూపులు క‌నిపిస్తున్నాయి విశాల్ అభిమానుల్లో.

విశాల్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని ఆయన తండ్రి జీఎస్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతోంది. విశాల్ త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే యువతిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని, త్వరలోనే హైదరాబాద్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలుస్తోంది. ఈ వార్తపై విశాల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ హీరో పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడవుతున్నాడని సంబరపడిపోతున్నారు. ఇంతకీ విశాల్‌కు కాబోయే జీవిత భాగస్వామి ఎవరో మరి. ..ప్రస్తుతం నిశ్చితార్థం పనుల్లో విశాల్ ఫ్యామిలీ బిజీగా వున్నట్టు తెలుస్తోంది. మ‌రి చూశారుగా విశాల్ పెళ్లి క్లారిటీపై మీ అభిప్రాయం అలాగే బెస్ట్ విషెస్ తెలియ‌చేయండి.