పాపం సునీల్‌.. జబర్దస్త్‌ కమెడియన్స్‌ కంటే దారుణం

552

తెలుగులో ఒకప్పుడు స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకున్న సునీల్‌ పరిస్థితి ఇప్పుడు దారుణంగా అయ్యింది.కమెడియన్‌గా స్టార్‌డం దక్కడంతో హీరోగా అవకాశాలు వచ్చాయి. ఎవరికైనా హీరోగా ఛాన్స్‌ అంటే ఖచ్చితంగా బెండ్‌ అవుతారు. సునీల్‌ కూడా హీరోగా ఛాన్స్‌లు రావడంతో కమెడియన్‌ కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టి హీరోగా సినిమాలు చేశాడు. సక్సెస్‌ ఫ్లాప్‌ ఇలా అటు ఇటుగా సినీ కెరీర్‌ కొనసాగించాడు.అయితే ఇప్పుడు సునీల్ పరిస్థితి దారుణంగా అయ్యింది.మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for sunil hero

సునీల్ ఒకప్పుడు పారితోషికం విషయంలో దాదాపుగా బ్రహ్మానందంతో పోటీ పడేవాడు. బ్రహ్మానందంకు రోజుకు రెండున్నర మూడు లక్షలు పారితోషికంగా ఇస్తే సునీల్‌ రెండు లక్షల వరకు పారితోషికం అందుకునే వాడు.సునీల్ హీరోగా ఉన్న సమయంలో మూడున్నర నుండి ఆరు కోట్ల వరకు సునీల్‌ పారితోషికం అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం సునీల్‌ హీరోగా సక్సెస్‌లను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు. దాంతో సునీల్‌ మళ్లీ తన మునుపటి కమెడియన్‌ పాత్రలు చేసేందుకు సిద్దం అయ్యాడు. ఒకటి రెండు చిత్రాల్లో సెకండ్‌ హీరోగా నటిస్తున్న సునీల్‌ చాలా చిత్రాలకు కమెడియన్‌గా నటించేందుకు ఓకే చెబుతున్నాడు.

Image result for sunil hero

ప్రస్తుతం అయిదు ఆరు చిత్రాల్లో కమెడియన్‌గా చేస్తున్న సునీల్‌ చాలా తక్కువ పారితోషికం అందుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఈమద్య కాలంలో జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా గుర్తింపు దక్కించుకుని సినిమాల్లో నటిస్తున్న కమెడియన్స్‌ ఏకంగా రోజుకు మూడు నాలుగు లక్షలు తీసుకుంటూ ఉంటే, సునీల్‌ మాత్రం కేవలం రోజుకు రెండున్నర లక్షల పారితోషికంతో సినిమాను చేస్తున్నట్లుగా పుకార్లు గుప్పుమంటున్నాయి.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో సునీల్‌ కమెడియన్‌ పాత్రను చేస్తున్నాడు. ఆ చిత్రంలో ఫుల్‌ లెంగ్త్‌ పాత్ర అవ్వడంతో 70 లక్షల పారితోషికంను మాట్లాడారు. చిన్న చిత్రాల్లో చిన్న పాత్రలకు రోజు వారి పారితోషికంను సునీల్‌ అందుకుంటున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకప్పుడు కోట్ల రూపాయల పారితోషికంను అందుకున్న సునీల్‌ ఇప్పుడు రోజువారి పారితోషికంతో సర్దుకు పోతున్నాడు అంటే సినిమా అనేది ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కమెడియన్‌గా మూడు నాలుగు సినిమాలు విడుదల అయ్యి, సక్సెస్‌ అయితే అప్పుడు సునీల్‌ కమెడియన్‌గా భారీ పారితోషికంను అందుకునే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.సునీల్‌ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సినిమా ఇండస్ట్రీ గురించి అక్కడ ఒక్కొక్కరి బతుకుల జీవితం గురించి అలాగే స్టార్ గా ఉన్న సునీల్ ఈ స్థితికి రావడానికి గల కారణం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.