మా అసోసియేషన్ లో రచ్చరచ్చ.. హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో శ్రీకాంత్

435

మూవీ ఆర్టిస్టుల సంఘం `మా అసోసియేషన్`పైనా.. శివాజీరాజాపైనా బురదజల్లే ప్రక్రియ మొదలైందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఆర్టిస్టుల సంఘం గత అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పదవీ నుంచి తప్పుకున్న తర్వాత అందరివాడుగా ఉన్న శివాజీ రాజాపై ఓ వర్గం కక్ష కట్టిందన్న సిగ్నల్స్ అందాయి. ఆ క్రమంలోనే ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక విషపూరితంగా ప్రచురించిన కథనం టాలీవుడ్లో సంచలనమైంది. ఈ కథనం సారాంశం ప్రకారం.. మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీ రాజా `మా` నిధులు మింగేశాడని, మెగా ఈవెంట్తో వచ్చిన నిధి నుంచి కొంత దుర్వినియోగం అయ్యిందని సదరు పత్రిక కథనం వెల్లడించింది.

Image result for maa association

మా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ నరేష్ ఈ తప్పిదాల్ని గ్రహించి శివాజీ రాజా పదవిని ఊస్టింగ్ చేసి, సీనియర్ నరేష్ కు కట్టబెట్టారని కథనంలో పేర్కొన్నారు.అయితే ఈ విషయం మీదనే మా అసోసియేషన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది.అయితే ఆ ప్రెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.మరి శ్రీకాంత్ ఏమన్నాడో చూద్దామా.మా అసోసియేషన్ డబ్బులను శివాజీరాజా హీరో శ్రీకాంత్ అలాగే కొందరు తిన్నారని వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను ఖండిస్తూ మా అసోసియేషన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది.ఆ ప్రెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.నేను డబ్బును తిన్నానని కొన్ని మీడియా ఛానెల్స్ లలో స్క్రోలింగ్ వస్తుంది.నా తప్పు లేకున్నా కూడా నా పేరు వస్తుంది.

Maa Association Funds Misuse Controversy Press Meet Gallery

అమెరికాలో జరిగిన మెగా ఈవెంట్ విషయంలో నేను ఉన్నా కానీ అగ్రిమెంట్ మీద నేను సంతకం పెట్టలేదు.ఆ డబ్బులు మొత్తం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిండెంట్ మాత్రమే చూసుకున్నారు.నాకు శివాజీ మీద నమ్మకం ఉంది అతను తినే టైపు కాదు.ఇక నరేష్ గారు కూడా అలాంటి మనిషి కాదనే అనుకుంటున్నా.అయితే డబ్బును మా అసోసియేషన్ వరకు తీసుకొచ్చాము.ఎంత రావాలో అంత వచ్చింది.కానీ ఇక్కడికి వచ్చాకా మాయమయ్యిందని వార్తలు వచ్చాయి.నేను నరేష్ గారిని అడిగితే అవన్నీ పట్టించుకోవద్దు అన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే మీడియాలో నాపేరు వస్తుంది అంటే ఏం కాదులే అని చాలా ఈజీగా అన్నారు.మీడియా దగ్గరకు వచ్చి చెప్పమంటే నేను రాను చెప్పను అన్నాడు.అంటే ఇందులో ఆయన తప్పు చేశారనే కదా అర్థం.నేను డబ్బు తిన్నట్టు ఆధారాలు చూపిస్తే జీవితంలో మా అసోసియేషన్ గడప కూడా తొక్కను ఒకవేళ నరేష్ గారు నిరూపించకపోతే నేను చేస్తా అన్న పనినే ఆయన కూడా చేస్తాడా.. అని నరేష్ కు సవాల్ విసిరాడు.దమ్ముంటే నా సవాల్ ను సవీకరించమనండి అంటూ మీడియా సాక్షిగా నరేష్ కు సవాల్ విసిరాడు.చూడాలి మరి ఈ విషయం చివరికీఏమౌతుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మా అసోసియేషన్ డబ్బులు మింగేశారు అని వచ్చిన వార్తల గురించి అలాగే హీరో శ్రీకాంత్ నరేష్ మీద చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.