ప్రేమించినందుకు ఏడాదిపాటు వేధించారు స్నేహ కన్నీటి గాధ

647

అచ్చ‌తెలుగు న‌టి ,ఆమెనిచూస్తే మ‌న ఇంటిలో వ‌దిన అక్క గుర్తువ‌స్తారు.. అంత అంద‌మైన మోము అభిన‌యం, చూడ‌గానే ఇట్టే క‌ట్టిప‌డేసే అంద‌మైన చిరున‌వ్వు ఆమె సొంతం.. ఆమె న‌టి స్నేహ‌.. ఇక ఆమె లైఫ్ లో చాలా మంచి పొజిష‌న్లో ఉన్నారు.. టాలీవుడ్ లో ప్ర‌ముఖ హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి చిత్రాల‌లో న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు… ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు బాగా దగ్గ‌ర అయ్యారు న‌టి స్నేహ‌… తాజ‌గా ఓ ఇంట‌ర్యూలో తన ప్రొఫెషనల్ లైఫ్ విషయాలతో పాటు… పర్సనల్ లైఫ్ విషయాలు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన భర్త ప్రసన్నతో ప్రేమయాణం, పెళ్లి, పెళ్లికి ముందు జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పారు న‌టి స్నేహ‌.

Image result for స్నేహ

స్నేహ అసలు పేరు సుహాసిని రాజా రామ్ నాయుడు. సినిమాల్లోకి వచ్చే ముందు పేరు మార్చుకున్నార‌ట‌ ముంబైలో పుట్టిన‌స్నేహ దుబాయ్‌లో కొంతకాలం ఉన్నారు. తర్వాత చెన్నై షిప్టయ్యారు. అయితే తమ పూర్వీకులు ఎక్కడి వారో తనకు తెలియదు అని స్నేహ తెలిపింది.దుబాయ్‌లో 9వ తరగతి చదువుతున్నప్పుడు 4వ తరగతి అబ్బాయి నాకు లవ్ లెటర్ ఇచ్చాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, లవ్ చేస్తున్నాను అని అందులో రాసి ఉంది. నీ వయసేంటి నా వయసేంటి అంటే… నీకు ఓకే అయితే నాకు ఓకే’ అని ముద్దుగా చెప్పాడు. లవ్ అంటే ఏమిటో తెలియని వయసులో అది వెరీ క్యూటీ, ఇన్నోసెంట్ లెటర్ అని స్నేహ గుర్తు చేసుకున్నారు.ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్ అంటే ఓ రేంజిలో జీవితం ఉంటుందని అనుకుని వచ్చాను. కానీ ఇక్కడకు వచ్చాక అది ఎంత కష్టంగా ఉంటుందో అర్థమైంది. తొలి సినిమా సమయంలోనే ఏడ్చేసి మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాను అని చెప్పారు, తర్వాత అమ్మానాన్నతో చెప్పాను. వారు సర్దిచెప్పడంతో సినిమాల్లో కంటిన్యూ అయ్యాను అని స్నేహ తెలిపారు.ఇక త‌న పెళ్లి విష‌యం చెబుతూ పెళ్లికి మా ఇంట్లో 200 శాతం ఓకే… కానీ ప్రసన్న వాళ్ల ఇంట్లో ఇష్టం లేదు. దాదాపు సంవత్సరం గొడవ పడ్డ తర్వాత ఒప్పుకున్నారు. కానీ పెళ్లి తర్వాత మా మామగారు చాలా రియలైజ్ అయ్యారు. నీలాంటి మంచి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రశంసించారు అని స్నేహ తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పెళ్లికి ముందు, మా మధ్య ప్రేమ మొదలవ్వడానికి ముందు పసన్నకు నాపై కోపం ఉండేది. నేను చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఆయన చేశారు. అప్పుడు ప్రసన్న అయితే నేను ఆ సినిమా చేయను అని చెప్పానట, అది నాకు కూడా గుర్తు లేదు. అప్పటి నుంచి నాపై కోపం పెంచుకున్నారు. తర్వాత ఇద్దరం మరో సినిమా చేసినపుడు కూడా నాతో మాట్లాడలేదు. అయితే నా గురించి పూర్తిగా తెలుసుకున్నాక రియలైజ్ అయ్యారు. ఆయనే ముందు ప్రపోజ్ చేశారు అని స్నేహ తెలిపారు.పెళ్లి తరువాత హనీ మూన్ వెళ్లాం. ప్రసన్నకి బంగీ జంప్ ఇష్టం. నాకేమో భయం… నాతో పట్టుబట్టి జంప్ చేయించారు. అయితే అందుకు నేను టాటూ వేయించుకోవాలని కండీషన్ పెట్టడంతో వెంటనే వేయించుకున్నారు. భయపడుతూనే బంగీ జంప్ చేశాను. జంప్ చేస్తూ నాకు ఆయన ఐ లవ్ యూ చెప్పడం ఎప్పటికీ గుర్తుండి పోతుందని స్నేహ తెలిపారు.ఓ సినిమా షూటింగ్ కోసం రాత్రి పూట తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో నాన్న, అన్నయ్య ఈ సమయంలో వద్దని చెప్పినా వినలేదు. కొంతదూరం వెళ్లిన తరువాత కారు ప్రమాదానికి గురైంది. దీంతో 6 నెలలు పాటు నడవలేని పరిస్థితి ఏర్పడింది. దేవుడి దయ వల్ల 2 నెలల్లో కోలుకున్నాను అని స్నేహ తెలిపారు. మొత్తానికి స్నేహ లైఫ్ లో జ‌రిగిన ఈ విష‌యాలు విన్న ఆమె అభిమానులు, మీకు మంచి ప్యూచ‌ర్ ఉంది అంటున్నారు, మ‌రి ఆమె చెప్పిన విష‌యాల‌పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.