భారీ మల్టి స్టారర్ సినిమాకు ఓకే చెప్పిన హీరో రామ్..

383

యువ కథానాయకుడు రామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు.వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.త్రినాథ‌రావు న‌క్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబరు 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Image result for hello guru prema kosame

‘ఉన్నది ఒకటే జిందగీ’ హిట్‌ తర్వాత రామ్‌ నటిస్తున్న చిత్రమిది.ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కాకుండానే రామ్‌ కొత్త ప్రాజెక్టుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈసారి ఒక మల్టి స్టారర్ కు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది.ఇందులో ఆయనతోపాటు మరో కథానాయకుడు సందడి చేయనున్నారట. ‘ఇది ఓ మల్టీస్టారర్‌.

Image result for hero ram

ఈ సినిమా దర్శకుడు ఇటీవల ఓ పెద్ద హిట్‌ అందుకున్నారు. స్క్రిప్ట్‌ పని జరుగుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది’ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై సవ్రంతి రవి కిశోర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.మరి ఆ రెండవ హీరో ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.