చిరు పవన్ బాలయ్య ఎన్టీఆర్ సరసన చేరిన హీరో రామ్.ఎందులోనో చూడండి

269

టాలీవుడ్ లో చాక్ లెట్ బాయ్ అనగానే గుర్తుకు వచ్చే హీరో రామ్.ఎలాంటి పాత్రకైనా తన ఎనర్జిటిక్ ను జోడి చేస్తాడు.అందుకే ఈయనను ఎనర్జిటిక్ స్టార్ అంటారు.రామ్ ప్రస్తుతం హలో గురు ప్రేమ కోసమే జీవితం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ అదిరిపోయే సాంగ్ పాడాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 

Related image

హీరోలు పాటలు పాడడం తొలినాళ్ళ నుంచి ఉన్న ట్రెండే. కానీ అది అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతూ ఉంటుంది.ఇప్పుడు రామ్ ఒక పాట పాడాడు. రామ్ చేత సాంగ్ పాడించాలనే ఐడియా దేవిశ్రీదే అట. మొదట రామ్ ఈ ప్రతిపాదనకు నిరాకరించాడట. దేవీశ్రీ పట్టు పట్టడంతో పాటని పలు మార్లు ప్రాక్టీస్ చేసి పడినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ సలహాలతో రామ్ అదరగొట్టేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పాటను ప్రకాష్ రాజ్ కూడా పంచుకున్నాడంట.

Hero Ram and Prakash Raj became singers for Hello Guru Prema Kosame movie

అప్పుడప్పుడూ స్టార్ హీరోలు ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలయ్య వంటి హీరోలు ఇప్పటికే తమ చిత్రాలలో హుషారెత్తించే పాటలు పాడిన అనుభవం సంపాదించారు.ఆ జాబితాలోకి ఇప్పుడు రామ్ చేరబోతున్నాడు.