పూరీ రామ్ కాంబినేషన్ సెట్ అయ్యింది..నాలో మంచోడిని చూసి బోర్ కొట్టిందా.. అంటూ రామ్ ట్వీట్

233

చాలా రోజుల నుంచి దర్శకుడు పూరి జగన్నాథ్ కు సరైన హిట్ లేదు. దాంతో అతనితో ఎవరు సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ఇన్నిరోజులు హీరో రామ్ ముందు వచ్చాడు. పూజి జగన్నాథ్ తనసొంత నిర్మాణ సంస్థలో రామ్ హీరోగా సినిమా ప్రారంభించనున్నాడు. ఓ వైవిధ్యమైన కథతో సినిమాను రూపొందించనున్నారు. జనవరి రెండో వారం తరువాత ఈ సినిమా సెట్ మీదకు వెళ్లనుంది.

Image result for puri jagannath ram

రామ్ సరసన హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి చార్మీ సహనిర్మాతగా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే సినిమాలో కాస్ట్, టెక్నికల్ టీమ్ ని అనౌన్స్ చేయనున్నారు.రామ్ నటిస్తున్న 17వ చిత్రం ఇది.

నన్ను మంచివాడిగా చూసి బోర్ కొట్టిందా.. అయితే ఇప్పుడు చెడ్డవాడిగా చూడండి అంటూ రామ్.. పూరి, చార్మితో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. నా అభిమాన దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేయబోతున్నా. బోల్డ్ కంటెంట్ తో ఈ చిత్రం రాబోతుంది అని రామ్ తెలిపాడు. రామ్ ఈ చిత్రం కోసం గెటప్ మొత్తం మార్చేస్తున్నారు. రామ్ లేటెస్ట్ లుక్ చాలా కొత్తగా ఉంది.