ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే: హీరో రామ్ ట్వీట్‌

148

హీరో రామ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ గడుపుతున్నాడు. ప్రతి విషయానికి స్పందిస్తున్నాడు. ఇప్పుడు మరొక విషయం మీద స్పందించాడు.

అనంతపురంలో కియో మోటార్స్ ఏర్పాటుచేసిన యూనిట్‌లో తయారైన తొలి కారును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘కొన్నేళ్ల కిందట ఏపీలో అనంతపురం లాంటి మారుమూల జిల్లాకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదన్నారు. కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం నిరంతర కృషితోతో జిల్లాకు సాగునీటిని అందించామన్నారు. ఇంకా మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని.. రాయలసీమ ఏపీకి పారిశ్రామిక హబ్‌గా మారబోతుంది’అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను షేర్ చేసిన హీరో రామ్ ఏపీ సీఎంపై ప్రశంసలు కురిపించారు. ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని ట్వీట్ చేశారు.

దీనిపై కొందరు అభినందిస్తూ రిప్లై ఇచ్చారు.దాంతో మరోసారి స్పందించిన రామ్.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే… ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సలు లేదు. ముందు నేను పౌరుడిని.. ఆ తర్వాతే నటుడిని’ ట్వీట్ చేశారు.