ఒకేసారి రెండు సినిమాలను స్టార్ట్ చేస్తున్న నితిన్…దర్శకులు వీరే..

176

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో నితిన్ ఒకడు.ఎన్ని ప్లాప్ సినిమాలు వచ్చిన తట్టుకుని నిలబడ్డాడు.ఈ మధ్య నితిన్ చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి.చల్ మోహన్ రంగా శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచాయి.అందుకే తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

Image result for nithin venky kudumula

నితిన్ త్వరలో వెంకీ కుడుముల దర్శత్వంలో నటిచబోతున్నాడు.యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రంగా రూపొందబోతోంది.భీష్మ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Image result for nithin surya prathap

అయితే ఈ సినిమా ఇలా ఉండగానే సూర్య ప్రతాప్ అనే డెబ్యూ దర్శకుడితో కూడా నితిన్ ఓ రొమాంటిక్ కామెడీ చిత్రానికి కమిట్ అయ్యాడట. ఈ రెండు చిత్రాల షూటింగ్ తో నితిన్ బిజీ కాబోతున్నాడు. వెంకీ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక సూర్య ప్రతాప్ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలకు సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.