కొత్త సినిమాను స్టార్ట్ చేసిన RX100 కార్తికేయ

240

ఆర్ఎక్స్100’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ కలెక్షన్ పరంగా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిందీ సినిమా. చిత్రంలో కార్తికేయ అభినయం విశేషంగా ఆకట్టుకుంది.

Related image

దీంతో ఆయనతో సినిమా చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.ఇప్పుడు ఒక సినిమా ప్రారంభించాడు. బోయపాటి శ్రీను వద్ద అసిస్టెంట్ గా చేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కార్తికేయ.

Image result for karthikeya

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జనవరి 17) నుంచి మొదలైంది. మొదటి షెడ్యూల్ షూటింగ్‌కి ఒంగోలుని ఎంచుకున్నారు. హీరో కార్తికేయ, ఇతర తారాగణంతో వచ్చే నెల 8 వ తేదీ వరకు అక్కడే షూటింగ్ జరపనున్నారు. చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.